Breaking News

వైభవంగా శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత నాగేశ్వరస్వామి వారి కళ్యాణం

-కమనీయంగా శ్రీ స్వామి వారి కళ్యాణం నిర్వహించిన ఎమ్మెల్యే పేర్ని నాని, జయసుధ దంపతులు

మచిలీపట్నం,  నేటి పత్రిక ప్రజావార్త :
మచిలీపట్నం ఖొజ్జీలపేటలో వేంచేసియున్న ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత శ్రీ నాగేశ్వరస్వామి వార్ల కల్యాణం ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య (నాని) జయసుధ దంపతులు కమనీయంగా నిర్వహించారు. ఈనెల 11న మొదలై 19 వరకు నిర్వహిస్తున్న శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత శ్రీ నాగేశ్వర స్వామి వార్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం శ్రీ స్వామివారి కల్యాణం అంగ రంగ వైభవంగా జరిపారు. మాజీ మంత్రి,ఎమ్మెల్యే పేర్ని నాని – జయసుధ దంపతులు పీటలమీద కూర్చుని వేదపండితుల మంత్రోచ్చరణల మధ్య శ్రీ స్వామి వార్ల ఉత్సవ విగ్రహాలకు వైభవంగా కళ్యాణం జరిపారు. యాజ్జీకులు వైదిక ధర్మ స్మార్త ఆగమ పండితులు బ్రహ్మశ్రీ రాళ్లపల్లి ఆంజనేయ శాస్త్రి,అర్చక స్వాములు ఘంటసాల బాగరాజశేఖరశాస్త్రి, కొడమంచిలి భాస్కర చంద్రశేఖర శర్మ, రావూరు చైతన్య కుమార శాస్త్రి స్వామివార్ల కళ్యాణం కన్నుల పండువగా శాస్త్రోక్తంగా జరిపించారు. కళ్యాణానికి ముందుగా.. జొన్నవిత్తుల విద్యాసాగర్ ఇంటి వద్ద వారి కుమారులచే ఎదురుకోల ఉత్సవం జరిగింది. స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి పట్టణ ప్రముఖులు, పౌరులు పెద్ద ఎత్తున విచ్చేశారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి గోవాడ వెంకట కృష్ణారావు ఆలయ మర్యాదలతో అతిథులకు స్వాగతం పలికారు. కళ్యాణ వేడుకకు సమ్మెట ఆంజనేయ స్వామి దంపతులు,విశ్రాంత ఈఓలు గాదె విరభద్రచారి దంపతులు, మేకల సత్యనారాయణ, డివిజన్ కార్పొరేటర్ చిత్తజల్లు ప్రసన్న దంపతులు, తదితరులు స్వామి వారి కల్యాణోత్సవం లో పాల్గొన్నారు. శ్రీ స్వామి వారి కళ్యాణం అనంతరం అన్నసమారాధన నిర్వహించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రధాని మోదీ ప్రపంచం మెచ్చిన నాయకుడు

-అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలన మోదీ నినాదాలు -ఒకేరోజున రూ.2,08,548 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఒక రికార్డ్ -ఇంతటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *