విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక 42 వ డివిజన్, వెలంపల్లి కాలనీలో సుమారు 40 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న పార్క్ కు మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు ఆదివారం నాడు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ హెచ్ బికాలనీ లో గల వెలంపల్లి కాలనీ లో ఉన్న కామన్ ఏరియా లో 40 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా పార్క్ నిర్మించేందుకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు జగనన్న ప్రభుత్వం వచ్చాక విజయవాడ నగరం లో వివిధ పార్క్ లు రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు గత ప్రభుత్వ హయాంలో జలీల్ ఖాన్ గాని బోండా ఉమా గాని కేశినేని నాని దేవినేని ఉమా గాని వాళ్ళు దోచుకోవడం పై పెట్టినశ్రద్ద విజయవాడ నగర అభివృద్ధి పై పెట్టలేదన్నారు వందల కోట్ల రూపాయలతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చెప్పటడం జరిగిందన్నారు. వన్ సైడ్ లవ్ మాదిరిగా బీజేపీ పొత్తుకోసం జనసేనను ప్రేమిస్తుందన్నారు వచ్చే ఎన్నికలో రాష్ట్రం లో అన్ని పార్టీ లు ఒక్కటిగా అయిన జగన్ మోహన్ రెడ్డి ని ఓడించలేరని హితువు పలికారు జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో చేసిన సంక్షేమ పథకాలను, అభివృద్ధిని చూసి ప్రజలు ఓట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, స్థానిక కార్పొరేటర్ పడిగపాటి చైతన్య రెడ్డి, పార్టీ ఫ్లోర్ లీడర్ ఆరవ సత్యం, 39 వ డివిజన్ కార్పొరేటర్ నరేంద్ర రాఘవ, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొనకళ్ల విద్యాధరరావు, పార్టీ నాయకులు తంగెళ్ల రామ చంద్రరావు, వక్కలగడ్డ శ్రీకాంత్, మరియు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ లు, నగరపాలక సంస్థ అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
Tags vijayawada
Check Also
ప్రధాని మోదీ ప్రపంచం మెచ్చిన నాయకుడు
-అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలన మోదీ నినాదాలు -ఒకేరోజున రూ.2,08,548 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఒక రికార్డ్ -ఇంతటి …