Breaking News

సీఎం జ‌గ‌న్‌కు వకుళమాత ఆలయం ప్రారంభోత్స‌వానికి ఆహ్వానం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుప‌తిలోని శ్రీ వకుళమాత ఆలయం, (పాతకాల్వ (పేరూరు), తిరుపతి) ప్రారంభోత్సవానికి విచ్చేయాల‌ని కోరుతూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ ఈవో ఏ.వి. ధర్మారెడ్డి ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ను ఆహ్వానించారు. సోమ‌వారం క్యాంపు కార్యాల‌యంలో సీఎం జ‌గ‌న్‌ను క‌లిసి ఈ నెల 23న విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. 18న అంకురార్పణంతో మొదలై 23 వరకు వివిధ రకాల పూజా కార్యక్రమాలు, 23న మహా సంప్రోక్షణ ఆవాహన, ప్రాణ ప్రతిష్ఠ ఉంటాయ‌ని సీఎం జ‌గ‌న్‌కు వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రికి టీటీడీ వేద పండితులు స్వామివారి ప్రసాదాలు, వస్త్రం అందజేసి వేద ఆశీర్వచనం ఇచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రధాని మోదీ ప్రపంచం మెచ్చిన నాయకుడు

-అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలన మోదీ నినాదాలు -ఒకేరోజున రూ.2,08,548 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఒక రికార్డ్ -ఇంతటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *