Breaking News

హైకోర్టులో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు

-యోగా అభ్యాసాలను నిత్యము ఆచరించాలన్న హైకోర్టు సిజె.మిశ్రా

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం ఉదయం నేలపాడులోని ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా అధ్యక్షతన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ మైసూరు పాలెస్ నుండి ఇచ్చిన సందేశాన్ని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా తో పాటు పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, రిజిస్ట్రార్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ అధ్యక్షులు, సభ్యులు మరియు హై కోర్టు సిబ్బంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. అనంతరం యోగా మాస్టర్ బి.మల్లికార్జున రావు నేతృత్వంలో వారి సూచనలకు అనుగుణంగా యోగాభ్యాసాలను వీరంతా ఆచరించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ విశ్వమానవాళికి భారతదేశం అందించిన గొప్ప అభ్యసనాలు యోగాసనాలు అని కొనియాడారు. “యోగా ఫర్ హ్యుమానిటీ” అనే థీమ్ తో ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుచున్నదన్నారు. నిత్య నూతనోత్సాహాన్ని, శక్తిని కలిగించే యోగాసనాలను ప్రతి ఒక్కరు నిత్యం ఆచరించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.

హైకోర్టు అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్యం శ్రీ రామ్, హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షులు జానకిరామి రెడ్డి, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు గంటా రామారావు తదితరులతోపాటు పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, రిజిస్ట్రార్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ సభ్యులు మరియు హై కోర్టు సిబ్బంది పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రధాని మోదీ ప్రపంచం మెచ్చిన నాయకుడు

-అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలన మోదీ నినాదాలు -ఒకేరోజున రూ.2,08,548 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఒక రికార్డ్ -ఇంతటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *