అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం సీఎం వైయస్ జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటన లో పాల్గొననున్నారు. వరసగా మూడో ఏడాది జగనన్న అమ్మ ఒడి పథకాన్ని శ్రీకాకుళంలో కంప్యూటర్ బటన్ నొక్కి విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో సీఎం జమ చేయనున్నారు. ఉదయం 08.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం, 10.30 గంటలకు శ్రీకాకుళం చేరుకుంటారు, 11 గంటలకు శ్రీకాకుళం కోడి రామ్మూర్తి స్టేడియం చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారు. అమ్మ ఒడి పథకం లబ్ధిదారులతో ముఖాముఖి అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12.15 గంటలకు అక్కడి నుంచి తిరుగు పయనమై, 2.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
Tags AMARAVARTHI
Check Also
డిల్లీలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటన
-రవాణా వ్యవస్థపై క్షేత్ర స్థాయిలో సమీక్షా -రోడ్డు భద్రతా విధి విధానాలపై మంత్రి పరిశీలన -తెలంగాణ రవాణా శాఖ మంత్రి …