సోమవారం సీఎం వైయస్‌ జగన్‌ శ్రీకాకుళం జిల్లా పర్యటన…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం సీఎం వైయస్‌ జగన్‌ శ్రీకాకుళం జిల్లా పర్యటన లో పాల్గొననున్నారు. వరసగా మూడో ఏడాది జగనన్న అమ్మ ఒడి పథకాన్ని శ్రీకాకుళంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో సీఎం జమ చేయనున్నారు. ఉదయం 08.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం, 10.30 గంటలకు శ్రీకాకుళం చేరుకుంటారు, 11 గంటలకు శ్రీకాకుళం కోడి రామ్మూర్తి స్టేడియం చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారు. అమ్మ ఒడి పథకం లబ్ధిదారులతో ముఖాముఖి అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12.15 గంటలకు అక్కడి నుంచి తిరుగు పయనమై, 2.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *