Breaking News

జిల్లా జైలు సందర్శించిన మహిళా కమిషన్ సభ్యులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జైలులో ఉన్న మహిళా ఖైదీలకూ పోషకాహారం అవసరమని ..పోషక విలువలున్న ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులు బూసి వినీత అన్నారు. ఆమె బుధవారం విజయవాడ జిల్లా జైలును సందర్శించారు. జైలులోని మహిళా ఖైదీల రిజిస్టర్ ని తనిఖీ చేశారు. మహిళా ఖైదీల బ్యారెక్ లను పరిశీలించారు. జైల్లో వారికి అందిస్తున్న మెనూను ఆరాతీసి.. సంతృప్తి వ్యక్తం చేశారు. వివిధ కారణాలతో జైలు జీవితం అనుభవిస్తున్న మహిళా ఖైదీలు మానసికస్థైర్యం పెంచుకోవడానికి పౌష్టికాహారం తీసుకోవల‌సిన ఆవ‌శ్య‌క‌త మ‌రింత పెరిగిందన్నారు. ఇంటి వాతావరణంలో కుటుంబ సభ్యుల పర్యవేక్షణ, సలహాలకు నోచుకోలేని మహిళా ఖైదీల ఆరోగ్యభద్రతకు మహిళా కమిషన్ ఆలంబనగా నిలుస్తుందన్నారు. వ్యాధి నిరోధ‌క శ‌క్తి పెర‌గాలంటే బ‌ల‌వ‌ర్ధ‌క స‌మ‌తుల ఆహారం తీసుకోవ‌టం ఒక్క‌టే మార్గమని చెప్పారు. ఆహారాన్ని బట్టి మన మానసిక, భౌతిక వికాసం ఉంటుందన్నారు. విభిన్న రంగాల్లో పిల్లల శక్తి సామర్ధ్యాల ప్రదర్శనలో పౌష్టికాహారానిది ప్రధాన పాత్రగా చెప్పారు. మహిళలు పౌష్టికాహారం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేసినా ఆనారోగ్యాలను కొనితెచ్చుకోవాల్సి వస్తుందన్నారు. మహిళా ఖైదీలు స్వయంగా తయారు చేసిన వివిధ వస్తువులను పరిశీలించారు. సందర్శనలో మహిళా కమిషన్ సభ్యులు బూసి వినీత తో పాటు జిల్లా జైలు సూపరింటెండెంట్ హంసపాల్, జైలర్లు రత్నరాజ్, గణేష్ తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రధాని మోదీ ప్రపంచం మెచ్చిన నాయకుడు

-అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలన మోదీ నినాదాలు -ఒకేరోజున రూ.2,08,548 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఒక రికార్డ్ -ఇంతటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *