రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం ఉండేశ్వరపురం గ్రామములో ఒక డెంగ్యూ కేసు నమోదు కావడంతో దానిని పరిశీలించుటకు జిల్లా మలేరియా అధికారి జి.వీర్రాజు మరియు మలేరియా సబ్ యూనిట్ అధికారి రాజు రావడం జరిగినది. ఆ డెంగ్యూ కేసు వివరాలను సీతానగరం PHC హెల్త్ సూపర్వైజర్ K. శ్రీనివాసరావు మలేరియా అధికారి కి వివరించుట జరిగినది. అనంతరం సబ్ యూనిట్ అధికారి రాజు ఆ కేసు చుట్టుపక్కల పరిసరాలను, దోమల ఆవాస ప్రాంతాలను పరిశీలించుట జరిగినది. జిల్లా మలేరియా అధికారి స్థానిక ప్రజలతో ఉపయోగించని రుబ్బురోలు, పాత సీసాలు, జాడీలు , డిస్పోజబుల్ గ్లాసులు మొదలగు వాటిలో నీరు చేరి వాటిలో దోమలు వృద్ధి చెందుతాయని, వాటి వల్ల మలేరియా , డెంగ్యూ జ్వరాలు వస్తాయని వివరించుట జరిగినది. జులై నెల నుండి వర్షాలు ఎక్కువగా కురవడం వలన దోమలు బాగా వృద్ధి చెందుతాయని కాబట్టి పరిసరాలలో నీరు నిల్వ లేకుండా చూడాలని తెలియజేయుట జరిగినది. అనంతరం జిల్లా మలేరియా అధికారి ANM మరియు MLHP ల రికార్డులను పరిశీలించి తగిన సూచనలను ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమానికి హెల్త్ సూపర్వైజర్ కే శ్రీనివాసరావు తో పాటుగా Health Assistants స్వామి ,B. రూప్ కుమార్, ANM లు M.పద్మ ,B.కుమారి, MLHPలు షేక్ మౌనిక, మరియు బి. శైలజ, MLHP లు, ఆశా కార్యకర్తలు మరియు ఉండేశ్వరపురం గ్రామపంచాయతీకి చెందిన విటల్ పాల్గొనుట జరిగినది.
Tags rajamendri
Check Also
డిల్లీలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటన
-రవాణా వ్యవస్థపై క్షేత్ర స్థాయిలో సమీక్షా -రోడ్డు భద్రతా విధి విధానాలపై మంత్రి పరిశీలన -తెలంగాణ రవాణా శాఖ మంత్రి …