Breaking News

నగరపాలక సంస్థ అభివృద్ది పనులపై సమీక్ష

-పౌర సేవలు అందించే క్రమంలో 9494060060 నంబర్ గల వాట్సాప్ ప్రారంభం.
-అధికారులు, సిబ్బంది త్రాగునీరు, పారిశుధ్యం కి ప్రాధాన్యత ఇవ్వండి
-తొలుత రూడా కార్యాలయం సందర్శన.. విజ్ఞప్తులు స్వీకరించిన మంత్రి
-శానిటేషన్ సిబ్బంది జీతాలు రూ.18 వేలు చేసిన ఘనత జగన్ననదే
-మంత్రి ఆదిమూలపు సురేష్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమహేంద్రవరం నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని రాష్ట్ర పురపాలక పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డా. అదిమూలపు సురేష్ పేర్కొన్నారు.
శుక్రవారం స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశం లో జిల్లా కలెక్టర్ కె మాధవీ లత, పార్లమెంట్ సభ్యులు భరత్ రామ్, రూడా చైర్ పర్సన్ ఎమ్. షర్మిలా రెడ్డి, శాసనసభ్యులు జక్కంపూడి రాజా, డిసిసిబి చైర్మన్ ఆకుల వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి అదిమూలపు సురేష్ మాట్లాడుతూ, నగరంలో చేపట్టే ప్రతి అభివృద్ధి పని నిర్దిష్టమైన కాలపరిమితితో పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. ఇంజనీరింగ్, వాటర్ వర్క్స్, మెప్మా, ఏ విభాగంకు చెందిన ఏ పనైనా ప్రారంభించే ముందు శిలాఫలకం ఏర్పాటు చేసిన అనంతరం మాత్రమే పనులకు శ్రీకారం చుట్టాలని స్పష్టం చేశారు. సంబంధిత పనుల వివరాలను ప్రదర్శించేలా ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా ఆయా పనులు పూర్తయిన వెంటనే ప్రజా ప్రతినిధుల ద్వారా ప్రారంభించాల్సి ఉంటుందని మంత్రి తెలియజేశారు. రాజామహేంద్రవరం చారిత్రాత్మక, సాంస్కృతిక, ఆధ్యాత్మికంగా పర్యాటక పరంగా ఎంతో ప్రాచుర్యం పొందిన నగరమన్నారు. అధికారులు, సిబ్బంది నగర వాసులకు త్రాగునీటి ఇబ్బంది లేకుండా, శానిటేషన్ పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నగరాన్ని సమగ్ర అభివృద్ధి పరిచేందుకు 125 కోట్ల రూపాయలు నిధులతో పనులు చేపట్టేందుకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది అన్నారు. ఈ సందర్భంగా పిపిటీ ద్వారా అధికారులు ఇచ్చిన ఇండోర్ స్టేడియం, కంబాల చెరువు సమగ్ర అభివృద్ధి కార్యాచరణ, ఈట్ స్ట్రీట్, రివర్ ఫ్రంట్ బండ్, మల్టీ లెవెల్ కార్ పార్కింగ్, నాడు నేడు ఎవెన్యూ ప్లాంటేషన్ ,మోడల్ మోడల్ రోడ్స్, పార్కులు, అర్బన్ హెల్త్ క్లినిక్స్, అంతర్గత రహదారులు తదితర నిర్మాణ అంశాలపై సమావేశంలో సుధీర్ఘంగా మంత్రి చర్చించడం జరిగింది. ప్రజా రోగ్యం, శానిటేషన్ కోసం ప్రత్యేక ప్రణాళికలు తయారు చేయాలని పేర్కొన్నారు. నగరపాలక సంస్థ అధికారులు సిబ్బంది ప్రతి ఒక్కరు రాజమహేంద్రవరాన్ని కాలుష్య రహిత నగరముగా తీర్చిదిద్దేందుకు సమన్వయంతో కృషి చేయాలన్నారు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యా వ్యవస్థ పటిష్టతకు పదివేల కోట్ల రూపాయలు నిధులు తో పాఠశాలల ఆధునీకరణ చేపట్టారన్నారు.
పార్లమెంటు సభ్యులు మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ నగరంలో చేపట్టే అభివృద్ధి పనుల అనంతరం వాటి నిర్వహణను సంబంధిత కాంట్రాక్టర్ మూడు సంవత్సరాలు పాటు నిర్వహించేలాగా నిబంధనలను పొందుపరచాలని పేర్కొన్నారు. వాటర్ బాడీ నిర్వహణ విషయంలో కూడా వివరించాల్సి ఉంటుంది అన్నారు. గోదావరిలో కలిసే మురుగునీరు ఫిల్టర్ చేసిన తరువాత నగరంలో కాకుండా బయట వరకు పైపు నిర్మాణం చేపట్టి గోదావరి కలిపేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న రైల్వే స్టేషన్ రోడ్డు అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు.
రూడా చైర్ పర్సన్ ఎమ్. షర్మిలా రెడ్డి మాట్లాడుతూ, నగరంలో మునిసిపల్ స్కూల్స్ లో ఉపాధ్యాయులు ఖాళీలు భర్తీ చేయాల్సి ఉందని తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్య స్థానంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఇతర కార్యాలయాలు ఏర్పాటు చేయడం వలన నగర అభివృద్ధిపై మరింతగా దృష్టి సారించామని జిల్లా కలెక్టర్. కే మాధవిలత, కమిషనర్ దినేష్ కుమార్ లు తెలిపారు. నగర ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే క్రమంలో 9494060060 వాట్సప్ నంబర్ అందుబాటులోనికి తీసుకుని రావడం జరిగిందన్నారు. ఇప్పటికే ప్రజల భాగస్వామ్యంతో కాలువలు పరిశుభ్రం చేసే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. అందులో భాగంగా వార్డుల్లో శానిటేషన్ కోసం అదనపు సిబ్బంది ని కూడా తాత్కాలిక పద్ధతిలో నియమించామన్నారు. ఈ సందర్భంగా రూ.125 కోట్ల తో ప్రతిపాదించిన పనులు, ప్రస్తుతం వాటి పనులలో పురోగతి వంటి అంశాలపై మంత్రికి కమిషనర్ వివరించారు. మొత్తం 17 పనులలో 14 పనులు చేపట్టడం జరుగుతోందని, ఆరు టెండర్లు పూర్తి అయి ప్రగతిలో ఉన్నాయని, 4 పనులు టెండర్ దశలో ఉన్నాయని , రెండు పనులు సాంకేతిక పరమైన అనుమతి కోసం సమర్పించడం జరిగిందని కమిషనర్ తెలిపారు. నగరంలో 66 స్కూల్స్ లో నాడు నేడు లో భాగంగా తొలి దశలో 35 స్కూల్స్, రెండవ ఫేజ్ లో 29 స్కూల్స్ లో పనులు చేపట్టామని తెలిపారు.
సమీక్ష సమావేశంలో రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పర్సన్ షర్మిలా రెడ్డి, డిసిసిబి చైర్మన్ ఆకులు వీర్రాజు, రాజమహేంద్రవరం రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వరరావు, ఎస్.ఈ. జె. పాండురంగారావు, ఎంహెచ్ఓ వినూత్న నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రధాని మోదీ ప్రపంచం మెచ్చిన నాయకుడు

-అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలన మోదీ నినాదాలు -ఒకేరోజున రూ.2,08,548 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఒక రికార్డ్ -ఇంతటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *