-జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో సోమవారం శాసన మండలి సభ్యులు మొండితోక అరుణ్‌కుమార్, జిల్లా కలెక్టర్ ఎస్‌డిల్లీరావు, జాయింట్ కలెక్టర్ ఎస్ నూపూర్ అజయ్, డిఆర్‌వో కె.మోహన్‌కుమార్‌లు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్య్రసమరయోదుడు విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు బ్రిటీష్ అటవీ చట్టం నుండి గిరిజనలను కాపాడేందుక పోరాటం చేసిన యోదుడని అన్నారు. స్వాతంత్య్రోద్యమ పోరాటాన్ని సాగించిన సమయంలో ఆయన చూపిన తెగువను, ధైర్యాన్ని, నిబద్దతను నేటి యువతరం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అల్లూరి సీతారామరాజు దేశభక్తి ప్రతి ఒక్కరికి స్పూర్తిదాయకమన్నారు. భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రలో తెలుగునాట ఆంగ్లేయులను ఎదుర్కున్న మహాజ్వల శక్తి మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు అని ఆయన పేర్కొన్నారు. స్వాతంత్య్ర పోరాట ఉద్యమం ద్వారా బ్రిటిష్ దాసశంఖలాల నుండి గిరిజన ప్రజలను విముక్తి కలిగించేందుకు అలుపెరగని పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని ఆయన అకుంటిత దీక్ష సాహసము ఏకగ్రత పోరాట పటిమ నేటి యువతకు స్పూరి దాయకమన్నారు. అజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా అల్లూరి సీతారామరాజు 125 జయంతి ఉత్సవాలను దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించామని కలెక్టర్ డిల్లీరావు అన్నారు.
స్వాతంత్య్ర సమరయోదులకు ఘనసన్మానం…
క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 42 రోజులపాటు జెలు శిక్ష అనుభవించి ఉక్కు మహిళగా పేరు గాంచిన స్వాతంత్య్ర సమర యోధురాలు 93 సంవత్సరాల శ్రీమతి రాంపిళ్ల నరసాయమ్మను,
1943 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 1948లో వార్థాలోని గాంధీ సేవాగ్రమ్ అశ్రమంలో పండిట్ జవహర్‌లాల్ నెహ్రు వివాహాంలో పాల్గొన్న 105 సంవత్సరాల రావూరి అర్జునరావును, 95 సంవత్సరాల రావూరి మనోరమను ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు, శాసన మండలి సభ్యులు మొండితోక అరుణ్‌కుమార్, జాయింట్ కలెక్టర్ నూపూర్ అయజ్, డిఆర్‌వో కె.మోహన్‌కుమార్‌లు ఘనంగా సన్మానించి దుశ్శాలువ, మెమెంటోలును అందజేశారు.
అజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా జిల్లాలో వారం రోజుల పాటు వివిద విభాగాలలో విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వక్తుత్వ, పాటలు, ముగ్గుల పొటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులను, సర్టిఫికెట్లను ప్రధానం చేశారు.
కార్యక్రమంలో ఇండియాన్ రెడ్ క్రాస్ సోసైటి జిల్లా అధ్యక్షులు డా. జి. సమరం, జిల్లా యువజన సర్వీసుల శాఖ సిఇవో యు. శ్రీనివాసరావు, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి యం. రుక్మాంగదయ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు.