విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో 1008 పాఠశాలల్లో చదువుకుంటున్న ఒకలక్షా,43వేల425మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుందని జిల్లా విద్యాశాఖ అధికారి సివి రేణుక ఒక ప్రకటనలో తెలిపారు. జగనన్న విద్యా కానుక జిల్లా స్థాయి కార్యక్రమం నగరంలోని అజిత్ సింగ్ నగర్ ఎంకే బేగ్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో నిర్వహించడం జరుగుతుందన్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం అయ్యే ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, జిల్లాకు చెందిన శాసనసభ్యులు, శాసన సభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొంటారని జిల్లా విద్యాశాఖ అధికారి సివి రేణుక ఆ ప్రకటనలో తెలిపారు.
Tags vijayawada
Check Also
ప్రధాని మోదీ ప్రపంచం మెచ్చిన నాయకుడు
-అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలన మోదీ నినాదాలు -ఒకేరోజున రూ.2,08,548 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఒక రికార్డ్ -ఇంతటి …