Breaking News

జిల్లాలో 1 లక్షా 29 వేల 921 మంది విద్యార్థులకు నాణ్యమైన ‘కానుక’… : కలెక్టర్ పి. రంజిత్ బాషా

-‘జగనన్న విద్యాకానుక’తో కృష్ణాజిల్లాలో 1లక్షా 29 వేల 921 మంది విద్యార్థులకు ప్రయోజనం
-కిట్‌లో యూనిఫామ్, బ్యాగు, బెల్టు, షూ, సాక్సులు, పాఠ్యపుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, వర్క్‌ బుక్కులు..
-ఈ ఏడాది అదనంగా 13 వేల 969 ఆక్స్ ఫోర్డ్ ఇంగ్లీషు–తెలుగు నిఘంటువులు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్థులకు ’జగనన్న విద్యా కానుక’ ద్వారా పంపిణీ చేసే స్టూడెంట్‌ కిట్లలో వస్తువుల నాణ్యతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని, కృష్ణాజిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా పేర్కొన్నారు. కృష్ణాజిల్లావ్యాప్తంగా 1461 ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు, 141 పాఠశాల సముదాయాలలో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న 1లక్షా 29 వేల 921 మంది విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కోసం 2022– 23 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యా కానుక కింద ఒక్కో విద్యార్థికి మూడు జతల యూనిఫాం క్లాత్, నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, బ్యాగుతోపాటు ఈసారి ఇంగ్లీషు–తెలుగు నిఘంటువులను కిట్‌ రూపంలో అందించనున్నారు. విద్యా కానుక ద్వారా అందచేసే వస్తువులు 100 శాతం నాణ్యంగా ఉండేలా పరస్పర సహకారంతో పర్యవేక్షించే బాధ్యతను స్కూల్‌ కాంప్లెక్స్‌ హెచ్‌ఎమ్, మండల విద్యాశాఖాధికారి, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బందికి అప్పగించినట్లు ఈ నేపథ్యంలో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా క్షుణ్ణంగా పరిశీలన జరుగుతోందని ఆయన చెప్పారు. కృష్ణాజిల్లాలో 6 లక్షల 91 వేల 806 నోటు పుస్తకాలు, 96 వేల 735 బెల్టులు, 1 లక్షా 29 వేల 921 బ్యాగులు, 1 లక్షా 29 వేల 921 యూనిఫాంలు, 1 లక్షా 17 వేల 459 జతల బూట్లు, 13 వేల 969 ఆక్స్ ఫోర్డ్ ఇంగ్లీషు–తెలుగు నిఘంటువులు, 10 వేల 869 మంది 1 వ తరగతి చిన్నారులకు చిత్రాలతో కూ²T…న పిక్టోరియల్ పుస్తకాలు జిల్లా వ్యాప్తంగా ఆయా పాఠశాలలోని విద్యార్థినీ విద్యార్థులకు అందచేయనున్నట్లు ఆయన వివరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రధాని మోదీ ప్రపంచం మెచ్చిన నాయకుడు

-అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలన మోదీ నినాదాలు -ఒకేరోజున రూ.2,08,548 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఒక రికార్డ్ -ఇంతటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *