విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామ, మండల మరియు రాష్ట్ర స్థాయిలో ఆంద్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ, వారు శాప్ టెన్నిస్ లీగ్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించి ఎంతో మంది క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసి వారికి ర్యాంకింగ్ సిస్టమ్ ప్రవేశపెట్టి వారిని ఘనంగా సత్కరించడం జరిగింది. క్రీడలలో చిన్నారులను, యువతను ప్రోత్సహించేందుకు శాప్ 2వ దశ శాప్ రాష్ట్ర స్థాయి ఓపెన్ టెన్నిస్ లీగ్ అండర్ 8, 10, 12, 14, 16, 18 బాలబాలికలకు వ్యక్తిగత విభాగంలో ఈ నెల 30, 31 వ తేదీలలో యన్.టి.అర్ జిల్లా విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలోని టెన్నీస్ క్రీడా ప్రాంగణంలో నిర్వహించనున్నారు. రాష్ట్ర స్థాయి శాప్ ఓపెన్ టెన్నిస్ లీగ్ లో పాల్గొనే వాళ్లు ఈనెల 25 వ తారీఖులోగా పేరు నమోదు చేసుకోవాలని శాప్ విసి& యండి డా. నక్కల ప్రభాకరరెడ్డి ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. మరిన్ని వివరాల కొరకు శాప్ టెన్నిస్ లీగ్ ఇంచార్జ్ శివరామకృష్ణ , ఫోన్ నెం: 9032530429 ని సంప్రదించగలరు.
Tags vijayawada
Check Also
ప్రధాని మోదీ ప్రపంచం మెచ్చిన నాయకుడు
-అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలన మోదీ నినాదాలు -ఒకేరోజున రూ.2,08,548 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఒక రికార్డ్ -ఇంతటి …