విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దశాబ్దాల కాలంగా సెంట్రల్ నియోజకవర్గంలో కొండదొర షెడ్యూల్ కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యను వీలైనంత త్వరలో పరిష్కరిస్తామని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో రెవెన్యూ అధికారులతో కలిసి కొండదొర కులస్తులతో మంగళవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. కొండదొర కులస్తులకు కుల ధ్రువీకరణ పత్రాల జారీకై సుధీర్ఘ కసరత్తు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ అంశంపై ఇప్పటికే రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి సహా జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ లతో మాట్లాడటం జరిగిందన్నారు. రెవెన్యూ అధికారులు సైతం 5 కు పైగా జిల్లాలలో గ్రౌండ్ వర్క్ నిర్వహించి.. సమగ్ర సమాచారాన్ని సిద్ధం చేశారని పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 140 కుటుంబాలు కొండదొర కుల పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. వీరంతా తమ సొంత జిల్లాల నుంచి మైగ్రేషన్ సర్టిఫికెట్లు తీసుకురావలసిన అవసరం ఉందని.. ఇందుకోసం ఆయా జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో మాట్లాడే బాధ్యత కూడా తానే తీసుకుంటానని తెలియజేశారు. ఇప్పటికే 9 మంది మైగ్రేషన్ సర్టిఫికెట్లు సమర్పించగా.. మిగతా కుటుంబాల నుంచి కూడా సేకరించిన అనంతరం నియోజకవర్గ స్థాయిలో కసరత్తు మొదలుపెడతామన్నారు. వీలైనంత త్వరలో అర్జీ పెట్టుకున్న ప్రతిఒక్కరికీ కుల ధ్రువీకరణ పత్రాలు అందజేసేలా చూస్తామని స్పష్టం చేశారు. గతంలో ఏ ఒక్క నాయకులు తమను పట్టించుకోలేదని.. తమ సమస్య పరిష్కారానికి విశేషంగా కృషి చేస్తున్న ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి ఈ సందర్భంగా అర్జీదారులు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు. కార్యక్రమంలో నార్త్ తహసీల్దార్ దుర్గాప్రసాద్, డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్, నాయకులు అలంపూర్ విజయ్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రధాని మోదీ ప్రపంచం మెచ్చిన నాయకుడు
-అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలన మోదీ నినాదాలు -ఒకేరోజున రూ.2,08,548 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఒక రికార్డ్ -ఇంతటి …