విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు పశ్చిమ శాసన సభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్., డివిజన్ కార్పొరేటర్లతో కలిసి డివిజన్ల పరిధిలో ప్రజలు ఎదుర్కోను పలు సమస్యలపై అధికారులతో కలసి చర్చించారు. నియోజకవర్గ పరిధిలోని 34, 35, 54, 55, మరియు 56 డివిజన్లకు సంబంధించి చేపట్టవలసిన అభివృద్ధి పనుల వివరాలు మరియు ప్రజలకు ఎదురౌతున్న పలు ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకువచ్చిన సందర్బంలో డివిజన్లలో టెండర్లు ఆమోదించిన పనులను వెంటనే ప్రారంభించవలసినదిగాను నిర్మాణంలో ఉన్న పనులు వేగవంతము చేసి పూర్తి చేయునట్లుగా చూడాలని కోరారు. డ్రెయిన్లు, త్రాగు నీటి సరఫరా, వీది దీపాల నిర్వహణ వంటి పలు సమస్యలను తక్షణమే పరిష్కారించునట్లుగా చూడాలని అన్నారు. సమావేశంలో కార్పొరేటర్లు బండి శివశక్తి నాగేంద్ర పుణ్యశిల, బాలసాని మణిమ్మ, శిరంశెట్టి పూర్ణచంద్ర రావు, యలకల చలపతిరావు మరియు అధికారులు యం.ప్రభాకర రావు, చీఫ్ ఇంజనీర్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ i/c డా.సి.హెచ్ బాబు శ్రీనివాసన్, సిటీ ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్ ఎస్.ఇ నరశింహ మూర్తి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రధాని మోదీ ప్రపంచం మెచ్చిన నాయకుడు
-అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలన మోదీ నినాదాలు -ఒకేరోజున రూ.2,08,548 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఒక రికార్డ్ -ఇంతటి …