Breaking News

బల్క్‌మిల్క్‌ కూలింగ్‌ యూనిట్‌ల భూ కేటాయింపులలో జిల్లా ప్రధమ స్థానం

-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో బల్క్‌మిల్క్‌ కూలింగ్‌ యూనిట్‌(బియంసియు)లకు నిర్మాణాలకు అవసరమైన భూముల కేటాయింపు పూర్తి స్థాయిలో చేయడం జరిగిందని, ఆటోమెటిక్‌ మిల్క్‌ కలెక్షన్‌ యూనిట్‌(ఎయంసియు) నిర్మాణాలకు అవసరమైన భూముల కేటాయింపును వేగవంతం చేస్తున్నామని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు, ఏపి డైరీ డెవలప్‌మెంట్‌ కో`ఆపరేటివ్‌ పెడరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఏపి అమూల్‌ ప్రోజెక్టు స్పెషల్‌ ఆఫీసర్‌ బాబు ఏ కు వివరించారు.
ఏపిడిడిసిఎఫ్‌యం డైరెక్టర్‌ బాబు ఏ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల జిల్లా అధికారులతో గురువారం వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నగరంలోని కలెక్టరేట్‌ నుండి కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నూపూన్‌ అజయ్‌ వీడియెకాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 112 బల్క్‌మిల్క్‌ కూలింగ్‌ యూనిట్‌(బియంసియు)కు గాను వాటికి పూర్తి స్థాయిలో భూములు కేటాయింపు జరిగి జిల్లా ప్రధమ స్థానంలో ఉన్నాదన్నారు. 272 గ్రామాలలో ఆటోమెటిక్‌ మిల్క్‌ కలెక్షన్‌ యూనిట్‌(ఎయంసియు) కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన భూములను గుర్తించే ప్రక్రియలో 161 పూర్తి అయ్యాయన్నారు. మిగిలిన 111 ఏయంసియులకు సంబంధించిన భూ కేటాయిపులు వేగవంతంగా నిర్వహిస్తున్నామని కలెక్టర్‌ డిల్లీరావు బాబు ఏకు వివరించారు. అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్‌ మాట్లాడుతూ ఏయంసియుల భూ కేటాయింపుల కార్యక్రమంలో క్షేత్రస్థాయి అధికారులతో నిరంతర టెలీకాన్ఫరెన్స్‌ సమీక్షా జరపాలని 10 రోజులలో పూర్తి స్థాయి లక్ష్యాలను సాధించాలని కలెక్టర్‌ అధికారులకు సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు జిల్లాలో ఉన్న యువతి యువకులకు గొప్ప సువర్ణ అవకాశం – పీఎం ఇంటర్న్‌షిప్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్ద ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారి ఆదేశముల మేరకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *