రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కలెక్టరేట్ స్పందన లో 146 ఫిర్యాదులు అందాయి. స్పందన కార్యక్రమంలో వచ్చే ప్రతి ఫిర్యాదులను ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి నిర్ణీత కాల వ్యవధి లో పరిష్కారం చూపాలని పరిపాలనాధికారి జీ. భీమా రావు తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి ఏవో జీ.భీమారావు తో కలిసి ల్యాండ్ పర్యవేక్షకులు కె.శ్రీనివాసరావు ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టరేట్ పరిపాలనాధికారి జీ. భీమా రావు మాట్లాడుతూ, సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో మొత్తం 146 మంది స్పందన కార్యక్రమానికి హాజరై ఫిర్యాదులను అందచేశారన్నారు. రెవెన్యూ, డిఆర్డిఏ, హౌసింగ్, హెల్త్, వికలాంగుల సంక్షేమ శాఖ, భూ సమస్యలు, కుటుంబ తగాదాలు వాటిపై ఫిర్యాదులు అందాయన్నారు. ఈ స్పందన కార్యక్రమం లో జిల్లా లోని రెండవ స్థాయి అధికారులు పాల్గొన్నారు.
Tags rajamendri
Check Also
ప్రధాని మోదీ ప్రపంచం మెచ్చిన నాయకుడు
-అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలన మోదీ నినాదాలు -ఒకేరోజున రూ.2,08,548 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఒక రికార్డ్ -ఇంతటి …