విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ నయారా ఎనర్జీ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో సెక్రటరీ కరుణాకర్ మాట్లాడుతూ నయారా యాజమాన్యం డీలర్లకు వ్యతిరేకంగా అమలు చేస్తున్న మోసపూరిత విధానాల వలన డీలర్లు ఎదుర్కొంటున్న పరిస్థితులును తెలియజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో మొత్తం 400 మంది, భారతదేశంలో అంతట 7500మంది నయారా డీలర్లు ఉన్నారని, రెండు కోట్ల రూపాయలు కంటే మేము ఎక్కువ పెట్టుబడి పెడుతున్నామని దాదాపు 75 వేల కుటుంబాలు ఈ అవుట్ లెట్ల పై ఆధారపడి ఉన్నాయని ఇప్పుడు నయారా అనుసరిస్తున్న విధానాల కారణంగా కుటుంబాలన్నీ రోడ్డుమీద పడుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. తనంతరం వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రభుత్వ బంకులతోపాటు సప్లై ఉండాలని, మార్చి నుంచి, జూలై వరకు, నష్టపరిహారం ఇవ్వాలని, ఐదు నుంచి, పది రూపాయలు వరకు, తగ్గించి రైతులును ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నయారా అసోసియేషన్ ప్రెసిడెంట్ కె.వి నారాయణ, వైస్ ప్రెసిడెంట్ లు, దేవుడు బాబు, పిక్క పూర్ణచంద్రరావు, అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రధాని మోదీ ప్రపంచం మెచ్చిన నాయకుడు
-అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలన మోదీ నినాదాలు -ఒకేరోజున రూ.2,08,548 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఒక రికార్డ్ -ఇంతటి …