విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
టీడీపీ ఆధ్వర్యంలో విజయవాడలో తలపెట్టిన దళిత గర్జన ఒక బూటకమని రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బోరుగడ్డ అనిల్ కుమార్ దుయ్యబట్టారు. మంగళవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లకు ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి పదవులు ఇచ్చి సముచిత స్థానం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కాజేశారనే ఆరోపణల్లో నిజం లేదన్నారు. దళితుల పట్ల అంత చిత్త శుద్ధి ఉంటే చంద్రబాబు పాలనలో నిధుల వినియోగం, ఇప్పుడు వినియోగం ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. దళితులను తప్పుదోవ పట్టించేందుకు టీడీపీ పార్టీ కుయుక్తులు పన్నుతోందని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ప్రతి దళిత కుటుంబానికి పెద్ద కొడుకు గా వ్యవహరిస్తున్నారని తెలిపారు. దళితులను అడ్డం పెట్టుకుని రాష్ట్రంలో అశాంతిని సృష్టించాలని చూస్తే తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, 2024లో కూడా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీలకు అమ్ముడుపోయి కొంతమంది పిచ్చివాగుడు వాగుతున్నారని, వారి చరిత్ర దళితులందరికి తెలుసునన్నారు. చంద్రబాబు వ్రాసిన స్క్రిప్ట్ చదివే పవన్ కళ్యాణ్, డిపాజిట్ కూడా పొందలేని కె ఏ పాల్ లు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. త్వరలోనే గుంటూరు లో దళిత ఐక్యసభ నిర్వహించి తమ సత్తా ఏమిటో చూపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ పి ఐ ప్రిన్సిపల్ అడ్వైజర్ రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రధాని మోదీ ప్రపంచం మెచ్చిన నాయకుడు
-అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలన మోదీ నినాదాలు -ఒకేరోజున రూ.2,08,548 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఒక రికార్డ్ -ఇంతటి …