విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచంలో చేపల ఉత్పత్తిలో భారతదేశం రెండవ స్థానంలో నిలిచిందని, 7 దశాబ్దాలలో 18 రెట్లు పెరుగుదల సాధించామని మెరైన్ ప్రోడక్ట్ ఎక్స్ పోర్ట్ డెవలప్ మెంట్ అథారిటీ చైర్మన్ డాక్టర్ కె. ఎన్. రాఘవన్ అన్నారు. విజయవాడ తాజ్ గేట్ వే హోటల్ లో మంగళవారం ఎంపెడా స్వర్ణోత్సవాల సందర్భంగా ” భారత దేశంలో విభిన్న జాతుల ఆక్వా కల్చర్ ను ప్రోత్సహించడానికి ఎంపెడా ప్రత్యేక దృష్టితో ఆంధ్ర ప్రదేశ్ లో – ప్రత్యామ్నాయ జాతుల పెంపకం ” అనే అంశంపై ఏర్పాటు చేసిన సెమినార్ ను డాక్టర్ రాఘవన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈసందర్భంగా రాఘవన్ ప్రారంభ ఉపన్యాసం చేస్తూ భారత దేశంలో మత్స్య సంపద ముఖ్యమైన ఆర్ధిక కార్యకలాపమని విభిన్నమైన వనరులు, సామర్థ్యంతో ఈరంగం అభివృద్ధి చెందుతున్నదని అయన అన్నారు. వ్యవసాయంతో పాటు మత్స్య సంపద ఒక ముఖ్యమైన రంగంగా గుర్తించి ఈ దిశగా అభివృద్ధికి బాటలు వేశామన్నారు. భారతదేశంలో చేపల ఉత్పత్తిలో గత 7 దశాబ్దాలలో 18 రెట్లు పెరుగుదల సాధించామని అంటే 1950-51 సంవత్సరంలో 0.75 మిలియన్ టన్నులు ఉన్న మత్స్య సంపద 2018-19 సంవత్సరం నాటికి 13.76 మిలియన్ టన్నులకు చేరుకోవడం ద్వారా ఈరంగం వేగంగా అభివృద్ధి చెందుతుందనడానికి ఇదే నిదర్శనం అన్నారు. ప్రపంచంలో చేపల ఉత్పత్తిలో చైనా తర్వాత భారతదేశం ముందంజలో ఉందన్నారు. ఈరంగం ద్వారా దేశీయ అవసరాలు తీర్చడమే కాకుండా 15 మిలియన్ల ప్రజలకు జీవనోపాధి పొందుతున్నారన్నారు.
ఆక్వా కల్చర్ మొత్తం ఎగుమతుల్లో 35 శాతం సాధించి భారత దేశంలోనే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందని రాఘవన్ అన్నారు. రాష్ట్రంలో 974 కిలో మీటర్ల తీరప్రాంతం కలిగి 1.2 లక్షల హెక్టార్లలో ఆక్వా ఉత్పత్తి జరుగుచున్నదని అయన అన్నారు. 1.74 లక్షల హెక్టార్ల ఉప్పునీటి ప్రాంతాలలో, 2.34 లక్షల హెక్టార్లు రిజర్వాయర్లు, సరస్సులలో, 28 వేల 200 హెక్టార్లు మాంగ్రో, చిత్తడి నేలలలో ఆక్వా ఉత్పత్తి జరుగుతున్నదని అయన అన్నారు. చేపల ఉత్పత్తికి సంబంధించి శాస్త్రీయ ఆక్వా కల్చర్ పద్దతులను, సామర్ధ్యానికి సంబందించిన శిక్షణను, ఆక్వా కల్చర్ కార్యకలాపాలను ప్రోత్సహించడానికి ఎంపెడా పూర్తి సహకారాన్ని అందిస్తుందని రాఘవన్ అన్నారు. 1982 లో మచిలీపట్నంలో ఆక్వా కల్చర్ ప్రమోషన్ కార్యాలయాన్ని, 2013 లో భీమవరంలో ఆక్వా కల్చర్ ప్రమోషన్ కోసం ఉప ప్రాంతీయ కేంద్రాన్ని, 2014 లో నెల్లూరులో ఆక్వా కల్చర్ ప్రమోషన్ కోసం ఒక ఉపగ్రహ కేంద్రాన్ని స్థాపించి ఎంపెడా ద్వారా ఈ రంగానికి సాంకేతిక మరియు ఆర్ధిక సహాయాన్ని అందించామన్నారు.
విశాఖపట్నంలో దేశంలోనే మొదటి రొయ్యల హేచరీ అయినా TASPARC ని ఎంపెడా ఏర్పాటు చేయుట ద్వారా భారతదేశంలో రొయ్యల పెంపకం విప్లవానికి పునాది రాయి వేశామన్నారు. ఈ హేచరీని ప్రభుత్వం ఇచ్చిన భూమిలో స్థాపించామని ఈ ఆక్వా ఫామ్ ఏర్పాటు తర్వాత దేశంలో 300 లకు పైగా హేచరీల అభివృద్ధికి మార్గం సుగమం అయ్యిందని అన్నారు. ఎంపెడా రొయ్యల హేచరీ నిర్వహణ, సీడ్ ఉత్పత్తుల్లో వందలాదిమంది పురుషులకు శిక్షణను ఇచ్చి ప్రతి సంవత్సరం సరిపడా రొయ్యల సీడ్ ఉత్పత్తి చేసేందుకు ఈ అవకాశం కల్పించిందన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో క్లస్టర్ ఫార్మింగ్ అనే విధానాన్ని ప్రవేశ పెట్టి ఎంపెడా ద్వారా రైతులకు ఉత్తమ నిర్వహణా పద్దతులపై శిక్షణ మరియు సలహాలు అందిస్తున్నామన్నారు. భారతదేశంలోనే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ” ప్రాసెసింగ్ హబ్ ” గా మారుతుందన్నారు. బ్లాక్ టైగర్ రొయ్యల పెంపకం, పునరుద్ధరణ, ఎల్ వనామా విస్తరణ, మడ పీత, సీబాస్, గిఫ్ట్, కోజియా మొదలగు జాతుల పరిచయం ద్వారా ఆక్వా కల్చర్ ను వైవిధ్య పరచడం మొదలగు కార్యక్రమాలను ఎంపెడా చేపట్టిందని రాఘవన్ అన్నారు.
ఈ సెమినార్ లో డాక్టర్ సువర్ణ చంద్రప్పగరి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అఫ్ జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు హైదరాబాద్ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్ కె. కన్నబాబు, ఎంపెడా డైరెక్టర్ ఎమ్. కార్తికేయన్, సెక్రటరీ కె. ఎస్. ప్రదీప్, నెట్ ఫిష్ సిఇఓ డా. జాయిస్ వి. థామస్, నాక్సా సిఇఓ డా. దీరిత్ ఇక్క, వివిధ ప్రాంతాలకు చెందిన ఆక్వా రైతులు, ఔత్సహిక రైతులు, తెలంగాణ రాష్ట్ర మత్స్య రైతు సంఘం రైతులు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రధాని మోదీ ప్రపంచం మెచ్చిన నాయకుడు
-అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలన మోదీ నినాదాలు -ఒకేరోజున రూ.2,08,548 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఒక రికార్డ్ -ఇంతటి …