Breaking News

గోదావరి వరదలు- శాశ్వత పరిష్కారాలపై దృష్టి… : సీఎం వైఎస్‌ జగన్‌

-బలహీనపడ్డ ఏటిగట్ల బోలోపేతం 
-నవంబరులోనే పనులు
-రాజమహేంద్రవరంపై ప్రత్యేక దృష్టి
-అధికార యంత్రాంగం పనితీరు భేష్‌
-సంబంధిత శాఖల వారందరీకి అభినందనలు
-ఇకపై ఇలానే కష్టపడి పనిచేయాలి
-ప్రజలకు నాణ్యమైన సేవలు, పారదర్శకతే ప్రమాణాలు
-బాధిత ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలు కొనసాగాలి
-శానిటేషన్‌, ప్రజారోగ్యంపై దృష్టిపెట్టండి
-ఎన్యుమరేషన్‌ మొదలుపెట్టండి
-అధికారులతో సమీక్షా సమావేశంలో సీఎం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గోదావరి వరద ప్రభావిత జిల్లాల మంత్రులు, కలెక్టర్లు, అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం రాజమహేంద్రవరం ఆర్‌ అండ్‌ బి గెస్ట్‌హౌస్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ గోదావరికి వరదల దృష్ట్యా శాశ్వతంగా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిపెట్టాలన్నారు. 1986 వరద తర్వాత ఆ స్థాయిలో గోదావరికి దాదాపుగా 28 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కనిపించిందన్నారు. రాజమహేంద్రవరం నగరానికి సంబంధించి శాశ్వత ప్రాతిపదికన తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిపెట్టాలన్నారు. ఎన్యూమరేషన్‌ చేసిన తర్వాత సోషల్‌ ఆడిట్‌ చేస్తే ఎవరైనా మిస్‌ అయితే వారు మళ్ళీ దరఖాస్తు చేసుకున్న తర్వాత వారికి అవకాశం ఉంటుందన్నారు. అంతా పారదర్శకంగా ఉండాలి, ఎవరూ నష్టపోకూడదన్నారు.
నిరంతరం ఇస్తున్న ఆదేశాల మేరకు జిల్లాల్లో అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా వ్యవహరించిందని సీఎంకి అధికారులు తెలిపారు. సచివాలయ సిబ్బంది, వలంటీర్లు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ముంపు ప్రమాదం ఉన్నవారిని అప్రమత్తంచేశారన్నారు. సహాయక కార్యక్రమాలకోసం అవసరమైన నిధులను వెంటనే సమకూర్చారని, దీనివల్ల మంచి సేవలు అందించగలిగామని సీఎంకు తెలిపారు. పశువులకు కూడా వెంటనే గ్రాసం అందజేశామన్నారు. శానిటేషన్‌పై కూడా దృష్టిపెట్టామన్నారు. మెడికల్‌ క్యాంప్‌లు కూడా రెడీగా ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదన్నారు. బాధితులకు సహాయం చేయడంలో ఉదారంగా ఉండాలన్న ముఖ్యమంత్రిగారి సూచనను పరిగణలోకి తీసుకుని మరింత ఎక్కువ మందికి సాయం చేయగలిగామన్నారు. గ్రామ సచివాలయ, వాలంటీర్‌ వ్యవస్ధ లేకపోతే మేం చాలా ఇబ్బంది పడేవాళ్ళమన్నారు. రిలీఫ్‌ క్యాంపులలో బాధితులకు నాణ్యమైన భోజనం అందజేశాం, మీరు చెప్పిన సూచనల మేరకు చక్కటి ఆహారాన్ని అందజేశామన్నారు. ముందస్తుగా ఆర్ధిక భరోసా ఇవ్వడంతో ప్రజలకు తక్షణమే సాయం అందించగలిగామన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ముందస్తుగా పునరావాసాల కోసం సాయం అందించలేదు, మీ హయాంలోనే ఇదంతా చూస్తున్నామన్నారు.
సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ లంక గ్రామాల్లో నష్టతీవ్రతపై అధికారులనుంచి వివరాలు కోరారు. అందరితో మమేకం అయ్యి సహాయక చర్యలు కొనసాగించాలని, ఎక్కడా నిర్లిప్తంగా వ్యవహరించవద్దని సీఎం ఆదేశించారు. గతంలో ఇలాంటి ప్రకృతివైపరీత్యాల సమయంలో కొంతమంది అధికారులను బాధ్యులుగా చేసి సస్పెండ్‌చేసి హడావిడి చేసేవారు, విపత్తుల సమయంలో నాయకులచుట్టూ తిరుగుతూ ఉండడంవల్ల పనుల్లో జాప్యం జరిగేది. అధికారులను ఎంపవర్‌ చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. వలంటీర్‌, సచివాలయం వ్యవస్థ వల్ల ఫలితాలు అందరికీ అందుతున్నాయన్నారు. ఆ తర్వాత నేను రావడం వల్ల అన్నీ సవ్యంగా జరిగాయా?లేదా?అని తెలుసుకుంటున్నాను. నేను కూడా వరదల సమయంలో వచ్చి, నా చుట్టూ మిమ్మల్ని తిప్పి నలుగురిని సస్పెండ్‌ చేస్తే ఏమవుతుంది, ఫైనల్‌గా ప్రజలకు మంచి జరగాలి, వారికి సాయం అందాలి: ప్రతీ అధికారి మరి ముఖ్యంగా అందరూ లైన్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులంతా బ్రహ్మండంగా చేశారు కాబట్టే ఈ రోజు ప్రజలు చాలా సంతోషంగా చూసుకున్నారన్న మాట వినిపిస్తుంది, మీ అందరికీ నా అభినందనలు. మున్ముందు కూడా ఇదే మంచి పేరు నిలబెట్టుకునేలా ముందుకెళదాం. నేను మార్గనిర్దేశం చేశాను, అందరికీ మనస్పూర్తిగా కృతజ్ఞతలు. శానిటేషన్‌ పై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఎన్యూమరేషన్‌ విషయంలో మరింత పారదర్శకంగా, కచ్చితంగా చేయాలి, రెండు వారాల్లో ఇదంతా పూర్తిచేసి తర్వాత సోషల్‌ ఆడిట్‌ కి పెడదాం, పారదర్శకంగా ఉండడంలో దేశానికే రోల్‌మోడల్‌గా నిలుస్తున్నామన్నారు. ఏ సీజన్‌లో జరిగిన నష్టం ఆ సీజన్‌ ముగిసేలోగా ఇవ్వగలిగితే ప్రజలు మరింత సంతోష పడతారు, దానిపై దృష్టిపెట్టండి, ప్రజాప్రతినిధులను కూడా మమేకం చేసుకుని కష్టపడదామన్నారు. వారిని మమేకం చేసినప్పుడే ప్రజలకు మరింత దగ్గరవుతారన్నారు. విద్యుత్‌పునరుద్దరణపై ఆరా తీసిన సీఎం. వరద ప్రాంతాలలో ఎక్కడా కూడా కరెంట్‌ పునరుద్దరణలో జాప్యం జరగలేదు కదా? అని ప్రశ్నించారు. దీనిపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై కౌంటర్‌ ఇవ్వండని అధికారులకు ఆదేశించారు. తప్పులు జరిగితే సరిచేసుకోవాలి అంతేకాని ఏం జరగకపోయినా చేస్తున్న నెగిటివ్‌ ప్రచారాన్ని తిప్పికొట్టాలి అవ డ్రెయిన్‌ ఏర్పాటుచేయడంపై నిపుణుల అభిప్రాయాలు తీసుకుని అంచనాలు సిద్దం చేయాలి అన్ని లంక గ్రామాలలో కమ్యూనిటీ హాళ్ళ నిర్మాణం చేస్తే విపత్తు సమయంలో పునరావాస కేంద్రాలుగా వినియోగించుకోవచ్చు. కరకట్టల ఆధునీకరణపై వెంటనే ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు. డెల్టా ఆధునీకరణ, గోదావరి వరదల నుంచి శాశ్వత పరిష్కారం కోసం అందజేసిన డీపీఆర్‌పై టెక్నికల్‌ ఎస్టిమేట్స్‌ తయారుచేసి వెంటనే నివేదించాలన్నారు. రాజమండ్రి పట్టణంలోకి ఎలాంటి వరదనీరు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమగ్రమైన నివేదిక రాగానే చర్యలు ప్రారంభిస్తామన్నారు. నిపుణులతో కూడిన టెక్నికల్‌ కమిటీని నియమించి ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. బండ్‌లు ఎక్కడెక్కడ బలహీనంగా ఉన్నాయో అవన్నీ కూడా గుర్తించి నవంబర్‌ నుంచి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుందామన్నారు. శాశ్వత చర్యలపై దృష్టిపెడదాం, నవంబర్‌ కల్లా మనం టెండర్లు పూర్తిచేసుకుని పనులు మొదలుపెడదామన్నారు. మీ అందరూ కూడా మనం యుద్దం చేస్తున్నది టీడీపీతో చంద్రబాబుతో కాదు, నెగిటివ్‌ మీడియాతో యుద్దం చేస్తున్నాం, మీడియా సంస్ధలు కూడా చొక్కాలిప్పుకుని ఒక పార్టీకి అధికారం కోసం పనిచేస్తున్నారు. వాస్తవాలను ప్రజలకు వివరించాలి. దుష్ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు.
ఈ సమీక్షా సమావేశానికి డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, మంత్రులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ,తానేటి వనిత, కారుమూరి నాగేశ్వరరావు, దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా), గుడివాడ అమర్‌నాథ్‌, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్ధానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రధాని మోదీ ప్రపంచం మెచ్చిన నాయకుడు

-అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలన మోదీ నినాదాలు -ఒకేరోజున రూ.2,08,548 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఒక రికార్డ్ -ఇంతటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *