విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జువైనల్ హోమ్‌లో చట్టంతో విభేదించబడిన బాలల సౌకర్యార్థం మౌలిక వసతులను మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు బూసి వినీత అన్నారు. విద్యాధరపురంలోని కబేళా సెంటర్‌లో ఉన్న గవర్నమెంట్ ఆఫ్ జువైనల్ వెల్ఫేర్ అండ్ కరక్షనల్ సర్వీసెస్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ది స్ట్రీట్ చిల్డ్రన్ హోంను గురువారం మహిళా కమిషన్ సభ్యురాలు బూసి వినీత సందర్శించి పలు సూచనలు, సలహాలను అందించారు. ఈ సందర్భంగా అక్కడ బాలలకు అందుతున్న సౌకర్యాల కల్పనలో భాగంగా కార్యాలయ రికార్డులను పరిశీలించారు అలాగే బాలలకు అందిస్తున్న భోజన సదుపాయాన్ని పరిశీలించి ఆహార నాణ్యతపై బాలలను అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం అందిస్తున్న సౌకర్యాలకు అదనంగా రానున్న రోజుల్లో మెరుగైన సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తామని అన్నారు. ముఖ్యంగా బాలలలో మంచి మార్పు తీసుకొచ్చి సమాజంలో ఉన్నతంగా రాణించేలా కృషి చేయాలని జువైనల్ హోమ్ అధికారులను మహిళా కమిషన్ సభ్యురాలు బూసి వినీత కోరారు.
Tags vijayawada
Check Also
ప్రధాని మోదీ ప్రపంచం మెచ్చిన నాయకుడు
-అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలన మోదీ నినాదాలు -ఒకేరోజున రూ.2,08,548 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఒక రికార్డ్ -ఇంతటి …