విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్థులలో సృజనాత్మకతను వెలికి తీసి నూతన ఆవిష్కరణలు చేసే దిశలో ప్రోత్సహించేందుకు గాను, విద్యా సంవత్సరం 2022-23 కు సంబంధించి నవంబరు నెలలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ లలోని విద్యార్థులకు టెక్నికల్ ఫెస్ట్(POLY TECH FEST-2022) నిర్వహించేందుకు నిర్ణయించినట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ డా. పోలా భాస్కర్ గారు తెలిపారు. పాలిటెక్నిక్ విద్యార్థుల శాస్త్రీయ ఆలోచనలకు, వినూత్న స్ఫూర్తికి ఈ టెక్నికల్ ఫెస్ట్ వేదికగా ఉపయోగ పడుతుందని పేర్కొన్నారు. టెక్ ఫెస్ట్ ను జిల్లా మరియు రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తామని, ఆయా జిల్లాల స్థాయిలో నవంబరు 14 నుండి 17 వరకు, రాష్ట్రస్థాయిలో నవంబరు 24 నుండి 26 వరకు నిర్వహించేందుకు ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిపారు. విద్యార్థులను ఇప్పటి నుంచే ఆ దిశగా తయారుచేసి ప్రోత్సహించేందుకు పాలిటెక్నిక్ కళాశాల ల అధ్యాపక సిబ్బంది మరియు ప్రిన్సిపాల్స్ కు తగు సూచనలు జారీ చేసినట్లు వివరించారు.
Tags vijayawada
Check Also
ప్రధాని మోదీ ప్రపంచం మెచ్చిన నాయకుడు
-అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలన మోదీ నినాదాలు -ఒకేరోజున రూ.2,08,548 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఒక రికార్డ్ -ఇంతటి …