విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శ్రావణమాసం వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రెండవ శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆలయంలో అమ్మవారికి విశేష అలంకరణ, పూజలు నిర్వహించారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా భక్తులు లక్ష కుంకుమార్చనలు, ఖడ్గమాల చేయించుకున్నారు.
అలాగే విశాఖలోని అమ్మవారి ఆలయాల్లో వరలక్ష్మీ వ్రత శోభ సంతరించుకుంది. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. సుగంధ ద్రవ్యాలు, పండ్ల రసాలు, పంచామృతాలతో అభిషేకం చేశారు. శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెండవ శ్రావణ శుక్రవారం సందర్భంగా రాష్ట్రంలోని అన్ని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
Tags vijayawada
Check Also
ప్రధాని మోదీ ప్రపంచం మెచ్చిన నాయకుడు
-అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలన మోదీ నినాదాలు -ఒకేరోజున రూ.2,08,548 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఒక రికార్డ్ -ఇంతటి …