విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రావణ శుక్రవారం,వరలక్ష్మి వ్రతం సందర్భంగా చిట్టి నగర్ లోని శ్రీ మహాలక్ష్మి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. శుక్రవారం తెల్లవారుజామునుంచే భక్తులు, ముఖ్యంగా మహిళ భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానానికి తరలివచ్చి పూజలు చేశారు. ఈ సందర్భంగా దేవస్థానం పాలకమండలి అధ్యక్షులు లింగిపిల్లి అప్పారావు, కార్యదర్శి మరుపిళ్ళ హనుమంతరావు, కోశాధికారి పిళ్ళా శ్రీనివాసరావు (పిసి) మాట్లాడుతూ శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీ వ్రతం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారని చెప్పారు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని భక్తులు దర్శించుకునేందుకు వీలుగా తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు ఉదయం నుంచి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు హోమాలు పూజలు చేశారని, దేవస్థానం పూజారులు చక్కగా పూజాకార్యక్రమాలు నిర్వహించారని వారు వివరించారు. శ్రావణమాసం ప్రారంభం నుంచి ప్రతినిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీ మహాలక్ష్మీ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కమిటీ సభ్యులు గూడేల రామకృష్ణ (ఆర్కే), ఈది ఎల్లారావు, తమ్మిన సూర్యకుమారి ,తదితరులు పాల్గొన్నారు
Tags vijayawada
Check Also
ప్రధాని మోదీ ప్రపంచం మెచ్చిన నాయకుడు
-అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలన మోదీ నినాదాలు -ఒకేరోజున రూ.2,08,548 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఒక రికార్డ్ -ఇంతటి …