తాడేపల్లి, నేటి పత్రిక ప్రజా వార్త :
రాష్ట్రం లోని అన్నీ జిల్లా గ్రంధాలయ సంస్థల చైర్మెన్స్ / చైర్ పర్సన్స్ మరియు కార్యదర్శులు మరియు అన్నీ ప్రభుత్వ ప్రాంతీయ గ్రంధాలయాల గ్రంధాలయాధికారులతో బొత్స సత్యనారాయణ, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి, బి.రాజ శేఖర్, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి, పాఠశాల విధ్యా శాఖ, ఆంధ్ర ప్రదేశ్ వారు రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశం తాడేపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించడం జరిగింది.
ముఖ్య అతిధి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి మాట్లాడుతూ అన్నీ జిల్లాలో ఉన్న గ్రంధాలయాలు అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనీ, మన ముఖ్యమంత్రి విద్యా వ్యవస్థ మరింత బలోపేతం చేసే దిశ గా అడుగులు వేయడం జరుగుతుంది అని చెప్పారు. త్వరలో రాష్ట్రం లో 4000 పైగా డిజిటల్ గ్రంధాలయాలు రాబోతున్నాయని మరియు ప్రతి గ్రామ సచివాలయము నకు ఒక డిజిటల్ లైబ్రరీ ఉండేవిధంగా చర్యలు తీసుకుంటున్నారని తద్వారా గ్రంధాలయాలు మరింత అభివృద్ది దిశలో పయనిస్తాయని తెలియజేశారు. గ్రంధాలయాలలో ఉన్న సమస్యలను, గ్రంధాలయ అభివృద్ది కొరకు తీసుకోవలసిన చర్యల గురించి తెలుసుకున్నారు. అందుకు పరిపాలనా పరమైన మరియు ఆర్ధిక పరమైన సమస్యలు,వాటి పరిష్కారము గురించి చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు.
బి.రాజ శేఖర్, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి, పాఠశాల విధ్యా శాఖ, ఆంధ్ర ప్రదేశ్ మాట్లాడుతూ గ్రంధాలయ వ్యవస్థను ఆధునికరించి డిజిటలైజేషన్ దిశలో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. గ్రంధాలయాలలో గైడ్ పుస్తకాల ను చదువరులకు అందించే విధానాన్ని రద్దు చేసి పిల్లలు పాఠ్య పుస్తకాలు చదివే విధంగా చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. డిజిటల్ లైబ్రరీలు గ్రంధాలయాలతో, పాఠశాలతో అనుసంధానం చేస్తే పేద విధ్యార్ధులకు కూడా ఆధునిక,సాంకేతిక విజ్ఞానం అందుబాటులోకి వస్తుంది అని తెలియజేశారు.
మందపాటి శేషగిరి రావు, చైర్మన్, రాష్ట్ర గ్రంధాలయ పరిషత్ మాట్లాడుతూ గ్రంధాలయ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి డిజిటల్ లైబ్రరీ వ్యవస్థను ప్రవేశపెడుతున్నారు అని తెలియజేశారు. వారి ఆలోచనలు ముందుకు తీసుకెళ్ళే విధంగా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కృషి చేస్తున్నారని తెలియజేశారు.
ఎం.ఆర్.ప్రసన్న కుమార్, సంచాలకులు, పౌర గ్రంధాలయాల శాఖ, ఆంధ్ర ప్రదేశ్ వారు గ్రంధాలయాలలో ఉన్న సమస్యలను మరియు గ్రంధాలయాలను అభివృద్ది కొరకు తీసుకోవలసిన చర్యలు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పాఠశాల విధ్యా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి.రాజ శేఖర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమములో రాష్ట్రం లోని అన్నీ జిల్లా గ్రంధాలయ సంస్థల చైర్మెన్స్ / చైర్ పర్సన్స్ మరియు కార్యదర్శులు మరియు అన్నీ ప్రభుత్వ ప్రాంతీయ గ్రంధాలయాల గ్రంధాలయాధికారులు పాల్గొన్నారు.
Tags tadepalli
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …