తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ తెనాలి డివిజన్ అధ్యక్ష కార్యదర్శులుగా పట్టణానికి చెందిన మంచికలపూడి రవి కుమార్(ప్రజాశక్తి), దొండపాటి కోటేశ్వరరావు (సూర్య) లు ఎంపికయ్యారు. స్థానిక టీబి రోడ్ పెన్షనర్ హాల్లో మంగళవారం ఉదయం డివిజన్ స్థాయి సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశానికి సీనియర్ జర్నలిస్టు గురిందపల్లి ప్రభాకర రావు అధ్యక్షత వహించారు. ఫెడరేషన్ గౌరవ సలహాదారులు బచ్చు సురేష్ బాబు, ఎస్.ఎస్ జహీర్ పర్యవేక్షణలో డివిజన్ స్థాయి నూతన కమిటీను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. నూతనంగా డివిజన్ అధ్యక్షునిగా ఎంపికైన రవికుమార్ మాట్లాడుతూ మాజీ అధ్యక్ష కార్యదర్శులు టి రవీంద్రబాబు, కె రత్నాకర్ లు ఫెడరేషన్ అభ్యున్నత్తికి విశేషంగా కృషి చేశారని, తమ ఎంపికకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. అదే స్ఫూర్తితో ఫెడరేషన్ విస్తరణకు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి పాటుపడతామన్నారు. అధ్యక్ష కార్యదర్శులుగా బాధ్యతలు స్వీకరించిన రవికుమార్ కోటేశ్వరరావు లకు సభ్యులు అభినందనలు తెలిపారు. పూలమాలలు, సాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ఫెడరేషన్ నియోజకవర్గం అధ్యక్ష కార్యదర్శులు అంబటి శ్యామ్ సాగర్, పుట్ల పున్నయ్య వేమూరు నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు మేకల సుబ్బారావు, ఎ శేషి రెడ్డి, నాయకులు యం.శ్రీకాంత్, జి ఎన్ ప్రేమ్ కుమార్, వీ లక్ష్మణరావు, ఏ సాంబశివరావు, బి చంద్రమోహన్, నాగరాజు, , సభ్యులు సిహెచ్ రవి, డి వెంకటేశ్వరరావు, ఎం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Tags tenali
Check Also
పుస్తకాలు, కిటికీలు తెరిస్తే.. అవి జ్ఞాన ద్వారాలు తెరుస్తాయి
-నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురణల ఆవిష్కరణ సభలో సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు IAS విజయవాడ, …