-శుక్రవారం రాత్రికి నూరు శాతం నమోదు పూర్తి చెయ్యండి
-కలెక్టర్ మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త:
శుక్రవారం రాత్రి లోగా ఈ క్రాప్ నమోదు నూరు శాతం పూర్తి చెయ్యాలని, రంగంపేట, బిక్కవోలు, గోకవరం, రాజానగరం, గోపాలపురం మండలాలు జిల్లా సగటు కంటే తక్కువ చెయ్యడం వల్ల జిల్లా ప్రగతి పై ప్రభావం చూపుతున్నట్లు జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు.
శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఈ క్రాప్ నమోదు పై జేసీ శ్రీధర్ తో కలిసి వ్యవసాయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో వ్యవసాయ , ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం కి సంబంధించి నూరు శాతం సాగు భూమి వివరాలు ఈ క్రాప్ లో నమోదు చెయ్యవలసి ఉందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకూ సుమారు 99 శాతం ఈ క్రాప్ నమోదు కాగా, ఐదు మండలాల్లో లక్ష్యాలను సాధించపోవడం ద్వారా జిల్లా ప్రగతి పై ప్రభావం పడిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందచేసే సబ్సిడీ, సబ్సిడేతర పథకాలు, ప్రకృతి విపత్తుల సమయంలో నష్ట పరిహారం, మార్కెటింగ్ చేసే పలు సందర్భాల్లో రైతులకు సహాయకారి గా నిలిచే అవకాశం కోల్పోయే అవకాశం ఉందన్నారు. ఈ ఉద్దేశ్యంతో నూరు శాతం ఈ క్రాప్ చెయ్యవలసి ఉందన్నారు.
జిల్లాలో మొత్తం 1,35,967 మంది రైతులు 3,41,671 ఎకరాలలో సాగు చేస్తుండగా అందులో 3,34,834 ఎకరాలు ఈ క్రాప్ లో నమోదు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. బుధవారం సాయంత్రానికి 94 శాతం ఈ క్రాప్ నమోదు పూర్తి చెయ్యడం జరిగిందన్నారు. గత 36 గంటల్లో మరో 4 నుంచి 5 శాతం మేరకు సాగు విస్తీర్ణం ఈ క్రాప్ చేయగలిగారని కలెక్టర్ పేర్కొన్నారు. వ్యవసాయ సాగు విస్తీర్ణం 1,90,131 ఎకరాలకు 1,86,164 ఏకరాల్లోను, ఉద్యానవన పంటలు 1,51,539 ఎకరాలకు 1,48,679 ఎకరాలు ఈ క్రాప్ నమోదు పూర్తి చేశారన్నారు. రంగంపేట మండలంలో 92.39 %, బిక్కవోలు లో 92.79 %, గోకవరం లో 95.90 %, రాజానగరం లో 96.22 %, గోపాలపురం లో 96.33% ఈ క్రాప్ పూర్తి చేశారని, మిగిలిన లక్ష్యాలను శుక్రవారం రాత్రికి పూర్తి చేయాలని కలెక్టర్ మాధవీలత ఆదేశించారు. ఆయా మండలాలు కు చెందిన వ్యవసాయ అధికారులు, గ్రామ సచివాలయ వ్యవసాయ సిబ్బంది రెవెన్యూ సిబ్బందితో సమన్వయం చేస్తూ లక్ష్యాలను పూర్తి చెయ్యాలని స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రానికి జిల్లాలో నూతనంగా నిర్దేశించిన సాగు విస్తీర్ణం లక్ష్యం 3,38,600 ఎకరాలకు గాను 3,38,190 ఎకరాల్లో 99.88 % పూర్తి చేసిన ఈ కె వై సీ. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్, డిఎ వో ఎస్. మాధవరావు, ఏ వో , (టెక్నికల్) శివ శ్రీనివాస్ లు పాల్గొన్నారు.