ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త:
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఏడవ రోజున శ్రీ కనక దుర్గమ్మ వారు శ్రీ సరస్వతి దేవి అలంకారంలో దర్శనం ఇస్తారు. మూలా నక్షత్రం శ్రీ అమ్మవారి జన్మనక్షత్రం. మహాకాళీ, మహాలక్ష్మి, మహా సరస్వతిగా శక్తిస్వరూపాలతో దుష్ట సంహారం చేసిన శ్రీదుర్గాదేవికి శరన్నవరాత్రి ఉత్సవాలలో మూల నక్షత్రంరోజున వాగ్దేవతామూర్తి అయినా సరస్వతీ అవతారం అలంకరించబడుతుంది. సరస్వతిదేవిని సేవించడం వలన విద్యార్థినీ విద్యార్థులకు వాగ్దేవి అనుగ్రహంవలన సర్వ విద్యలయందు విజయం పొందుతారు. మూలానక్షత్రం నుండి విజయదశమి వరకు విశేష పుణ్య దినాలుగా భావించి శ్రీ దుర్గమ్మను ఆరాధిస్తారు భక్తజనుల అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానజ్యోతిని వెలిగించే జ్ఞానప్రదాయిని శ్రీ సరస్వతిదేవి. శ్రీ సరస్వతిదేవి దర్శనం అఖిల విద్యాభ్యుదయ ప్రదాయకం.
Tags indrakiladri
Check Also
గుంటూరు జిల్లాలో ఉన్న యువతి యువకులకు గొప్ప సువర్ణ అవకాశం – పీఎం ఇంటర్న్‌షిప్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్ద ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారి ఆదేశముల మేరకు …