విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వాల్మీకి సంఘాలన్నీ కలిసి జేఏసీగా ఏర్పడి స్థానిక అలంకార్ సర్కిల్‌లో ధర్నాచౌక్ నందు 12వ రోజు నిర్వహిస్తున్న వాల్మీకుల సత్యాగ్రహ దీక్షకు రాయలసీమ జిల్లాల నుండి భారీగా తరలివచ్చారు. ఈ సత్యాగ్రహ దీక్షలు ఆంధ్రప్రదేశ్ వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో కన్వీనర్ బోయ ఈశ్వరయ్య సారధ్యంలో విజయవంతంగా జరుగుతున్నాయి. గురువారం దీక్షలకు సంఘీభావముగా మాజీ బీసీ వెల్ఫేర్ శాఖ మాత్యులు, శాసనసభ సభ్యులు శంకరనారాయణ విచ్చేసి బోయిల సమస్యను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తో చర్చించి అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. జనసేన పార్టీ తరపున పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పంపగా వచ్చిన పోతిన వెంకట మహేష్ వాల్మీకుల సమస్య ఎంతో కాలంగా రాజకీయ పార్టీలు బోయలను పావులుగా వాడుతూ వాడుకుంటున్నాయని వెంటనే ఈ సమస్యను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి చెప్పి కేంద్రం ప్రభుత్వంపై వత్తిడి తెస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. జనసేన జనసైనికులు కూడా ఈ ఉద్యమంలో పాలుపంచుకొని సమస్య తీరేవరకు ఉద్యమిస్తామని తెలిపారు. సత్యసాయి జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షుడు మాజీ శాసనసభ సభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు పార్థసారధి దీక్షకు వచ్చి సంఘీభావం తెలుపుతూ వాల్మీకులు నిజమైన గిరిజన తెగ అని వారిని రాజకీయపరమైన కారణాలతో అన్యాయం చేశారని ఇకనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతపూర్ జిల్లా పరిషత్ చైర్మన్ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ ముఖ్యమంత్రి బోయలకు అండదండగా నిలబడతారని వారి దృష్టికి తాము తీసుకొని వెళ్తామని తమ సంఘీభావం తెలిపారు. వాల్మీకి బోయ కార్పొరేషన్ చైర్మన్ మధుసూదన్ అందరి డైరెక్టర్లతో హాజరై ముఖ్యమంత్రి ద్వారా తమ సమస్యను పరిష్కరించుదామని హామీ ఇచ్చారు. మాజీ ఎ డి సి సి బ్యాంక్ అనంతపూర్ జిల్లా చైర్మన్ పామిడి వీరాంజనేయులు బోయల ఉద్యమాన్ని గ్రామ గ్రామానికి తీసుకొని వెళ్తామని బోయలు తమ డిమాండ్ తప్పక సాధించుకుంటారని తెలియజేశారు. ఆర్ ఆర్ గాంధీ నాగరాజు ఈ దీక్షలో పాల్గొని తాను కూడా ఈ సమస్యకు పరిష్కారం జరిగేదాకా తాను కూడా ముందుంటామని ఎవరి సత్యాగ్రహ దీక్షల కైనా తాను మద్దతు తెలుపుతామన్నారు. ఈ దీక్షలో పొగాకు రామచంద్ర రావు, సుంకర అత్తమ్మ, అంటే లక్ష్మన్న, వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్లు రామాంజనేయులు, విరూపాక్షి, నాగభూషణ అమ్మ, రామకృష్ణ, చొప్పవరపు భానుచందర్, పిక్కిలి సాయి ప్రవీణ్, తదితరులు చంద్రన్న మారెన్న తెలంగాణ జిల్లా నుంచి గొంది వెంకటరమణ, గోపాల్, మరియు అనంతపూర్ జిల్లా, సత్యసాయి జిల్లా, కర్నూలు జిల్లా, కడప జిల్లా, చిత్తూరు జిల్లా, గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా, కృష్ణాజిల్లాల నుంచి అనేకమంది దర్శకులు సందర్శించి పెద్ద ఎత్తున సంఘీభావం తెలిపారు.
Tags vijayawada
Check Also
గుంటూరు జిల్లాలో ఉన్న యువతి యువకులకు గొప్ప సువర్ణ అవకాశం – పీఎం ఇంటర్న్‌షిప్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్ద ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారి ఆదేశముల మేరకు …