Breaking News

వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారాలు, వైఎస్సార్ అచీవ్ మెంట్ అవార్డులు-2022 జాబితా రేపే ప్రకటన..

-వరుసగా రెండో ఏడాది వైఎస్సార్ అవార్డుల ప్రదానోత్సవం..
-14 అక్టోబర్, 2022న (రేపు) జాబితాను ప్రకటించనున్న హైపవర్ స్క్రీనింగ్ కమిటీ సభ్యులు
-వివిధ రంగాలలో విశేష కృషి చేసిన దాదాపు 25 మంది వ్యక్తులు/సంస్థలతో జాబితా సిద్ధం
-ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా నవంబర్ 1న అవార్డులు ప్రదానం..
-వ్యవసాయం, కళలు, సాహిత్యం, విద్య, జర్నలిజం, వైద్యం, సామాజిక సేవ మరియు ఇతర రంగాలలో విశేష కృషి చేసిన వారికి అవార్డులు..
– సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వరుసగా రెండో ఏడాది “వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్, వైఎస్సార్ అచీవ్ మెంట్ – 2022” అత్యున్నత పురస్కారాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను హైపవర్ స్క్రీనింగ్ కమిటీ సభ్యులు రేపు ప్రకటించనున్నట్లు సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వ్యవసాయం, కళలు, సాహిత్యం, విద్య, జర్నలిజం, వైద్యం, సామాజిక సేవ వంటి వివిధ రంగాలలో విశేష కృషి చేసిన దాదాపు 25 మంది వ్యక్తులు/సంస్థలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా నవంబర్ 1న గౌరవ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఈ అవార్డులు ప్రదానం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. వివిధ రంగాలలో అసాధారణ నైపుణ్యాలు, ప్రతిభా పాటవాలు కలిగి సమాజాన్ని విశేషంగా ప్రభావితం చేసిన అర్హులైన వ్యక్తులు/సంస్థలను గుర్తించి, క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే రాష్ట్రస్థాయి హైపవర్ స్క్రీనింగ్ కమిటీ అవార్డుల ఎంపికకు జాబితాను సిద్ధం చేసిందన్నారు. ఇందులో సామాజిక అభ్యున్నతి కోసం అసామాన్య కృషి చేసిన వ్యక్తులు/సంస్థలకే కమిటీ పెద్దపీట వేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారాల తరహాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వైఎస్సార్ జీవిత సాఫల్య, వైఎస్సార్ సాఫల్య పురస్కారాలు అందజేస్తోందన్నారు. వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ క్రింద ఎంపికైన వారికి 10 లక్షల నగదు బహుమతి, వైఎస్ఆర్ కాంస్య విగ్రహం, జ్ఞాపిక మరియు ప్రశంసా పత్రాన్ని ఇవ్వడం జరుగుతుందన్నారు. అదే విధంగా వైఎస్ఆర్ అచీవ్‌మెంట్ అవార్డు క్రింద ఎంపికైన వారికి రూ.5 లక్షల నగదు, జ్ఞాపిక మరియు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుందన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు జిల్లాలో ఉన్న యువతి యువకులకు గొప్ప సువర్ణ అవకాశం – పీఎం ఇంటర్న్‌షిప్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్ద ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారి ఆదేశముల మేరకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *