రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
వై.ఎస్.ఆర్. లైఫ్ టైం ఎచీవ్ మెంట్ అవార్డు & వై.ఎస్.ఆర్. ఎచీవ్ మెంట్ అవార్డులు 2023 ఇచ్చు నిమిత్తము వివిధ జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలలో పాల్గొని విశిష్ట ప్రతిభ కనబరిచిన వ్యక్తులు నుండి ధరఖాస్తులను ఆహ్వానించి యున్నారని జిల్లాకు చెందిన ఆసక్తి కలవారు ధరకాస్తు చేసుకోవాలని సోమవారం ఒక జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత తెలిపారు. సంబంధిత ప్రతిని నేరుగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయం, బొమ్మూరు రూరల్ తహశీల్దార్ కార్యాలయం ప్రక్కన వై.టి.సి. బిల్డింగ్ రాజమహేంద్రవరం కార్యాలయము నందు ఆఫీస్ పని సమయాల్లో అందచేయ వలసినదిగా తెలిపారు. జిల్లా ముఖ్య క్రీడా శిక్షకులు డి.ఎం.ఎం.శేషగిరి వివరాలు తెలుపుతూ, వివిధ జాతీయ స్థాయి క్రీడా పోటీలలోను, అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలలోను పాల్గొని విశిష్ట ప్రతిభ కనబరిచిన వ్యక్తులు తగిన ఆధారాలతో తమ ధరఖాస్తును ఒక పేజికి మించకుండ వారు సాధించిన విజయాల వివరాలు , చిరునామా, ఫోన్ నంబర్ , ఈ మెయిల్ వివరాలు పంపవలెను. వాటితో పాటు వారు సాధించిన విజయాలకు చెందిన పత్రములు (ప్రతిభకి సంభందించినవి) జత చేసి సదరు ధరఖాస్తును ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ వారి ఈ-మైల్ అడ్రస్ sportsinap@gmail.com, cashincentives.saap@gmail.com & dsakonaseema2022 @gmail.com నకు ది.20.08.2023 సాయంత్రం 5.00 గంటలలోగా పంపవలసినదిగా కోరడమైనది. మరిన్ని వివరములకు సెల్ నంబర్ .8639774430 ను సంప్రదించ గలరని తెలిపి యున్నారు.
Tags rajamandri
Check Also
శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …
Prajavartha Online Telugu News