Breaking News

రాజమహేంద్రవరం రూరల్ 97 శాతం ఓటర్ సర్వే పూర్తి

-బి ఎల్ ఓ, సూపర్వైజర్ పెండింగ్ దరఖాస్తు 100 శాతం అప్లోడ్ చెయ్యండి
-పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం పై కార్యశాల
-భౌతికంగా తీసుకున్న ధరఖాస్తుల డేటా ఎంట్రీ పనులను పరిశీలన
-జేసీ కె. తేజ్ భరత్

రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంటింటి సర్వే ద్వారా స్వీకరించిన ప్రతి ఒక ఓటరు గుర్తింపు వివరాలు నూరుశాతం డేటా ఎంట్రీ పూర్తి చెయ్యాలని రాజమహేంద్రవరం రూరల్ నియోజక వర్గ ఎలక్టోరల్ అధికారి / జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ ఆదేశించారు.

శనివారం ఉదయం రాజవోలు గ్రామంలో ఏ ఎం జి ఆడిటోరియం లో రాజమహేంద్రవరం రూరల్ నియోజక వర్గ బూత్ లెవల్ అధికారులకు, సూపర్వైజర్ తో ఓటరు గుర్తింపు, దరఖాస్తు లను పరిశీలిన నిమిత్తం ఏర్పాటు చేసిన కార్యశాల కి ముఖ్య అతిథిగా జేసీ హాజరయ్యారు.

ఈ సందర్భంగా. జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ మాట్లాడుతూ, కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు మేరకు జూలై 21 నుంచి ఆగస్టు 25 వరకు నియోజక వర్గంలో ఓటరు గుర్తింపు ఇంటింటి సర్వే నిర్వహించడం జరిగిందన్నారు. నియోజక వర్గంలో ఉన్న ప్రతి ఒక్క ఓటరును ఖచ్చితంగా ఇంటింటి సర్వే ద్వారా గుర్తించి వారి ఓటును నిర్ధారణ చెయ్యవలసి ఉందన్నారు. ఈ క్రమంలో బి ఎల్ వో తో పాటు అధికారిక రాజకీయ పార్టీ నియమించిన ఏజెంట్ కూడా ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చెయ్యడం ద్వారా జవాబుదారీతనం కలిగిన ఓటరు జాబితా రూపొందించ గలుగుతామని పేర్కొన్నారు. బి ఎల్ ఓ లపై ఎంతో బాధ్యత ఉందని, సూపర్వైజర్ కూడా అంకిత భావంతో పనిచేయాలని కోరారు.

రాజమహేంద్రవరం రూరల్ 29,744 దరఖాస్తు లను స్వీకరించగా 20,242 ఆమోదించడం జరిగిందని, 660 తిరస్కరించగా, 8,842 పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. స్వీకరించిన ప్రతి ఒక్క ధరఖాస్తు ఖచ్చితంగా బి ఎల్ వో క్షేత్ర స్థాయి లో పరిశీలించి ఆన్లైన్ లో నమోదు చేయాలన్నారు. నియోజక వర్గ సహాయ ఎలక్టోరల్ అధికారి వ్యక్తిగత పరిశీలన తప్పని సరి అని తెలిపారు. ఒకే డోర్ నంబర్ లో 10 మందికి మించి ఓటర్లు ఉంటే ఖచ్చితంగా క్షేత్ర స్థాయి లో పరిశీలించి నివేదిక ఇవ్వాలన్నారు. ఓటరు నమోదు నిరంతర ప్రక్రియ అని తెలియ చేశారు.

నియోజక వర్గ సహాయ ఎలక్టోరల్ అధికారి
తహశీల్దార్ పి. చిన్నారావు వివరాలు తెలుపుతూ, రూరల్ నియోజక వర్గంలో మొత్తం 263 పోలింగ్ కేంద్రాల ద్వారా ఇంటింటి సర్వే నిర్వహించామన్నారు. 94,403 ఇళ్ళ ఇంటింటి సర్వే లో 2,56,880 మంది ఓటర్ల కు గానూ 2,49,174 మంది (97 శాతం ) వివరాలు నిర్ధారణ చేశామన్నారు. 1266 మంది షిఫ్టింగ్, 3,891 మంది మరణించినట్లు, 688 డుప్లికేట్ ఓటర్లు, ఎపిక్ కార్డ్ ఫోటో అస్పష్టత ఉన్న 3726 ఓటర్లను గుర్తించి ఆమేరకు సరిచేయడం జరిగిందన్నారు. 18-19 వయస్సు ఉన్న 2,493 మంది, దివ్యంగ ఓటర్లు , 85 ఏళ్లు దాటిన 1164 మంది, థర్డ్ జెండర్ 12 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు.

ఈ కార్యశాలలో అన్నీ పోలింగ్ కేంద్రాల బి ఎల్ ఓ కు, క్లస్టర్ సూపర్వైజర్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *