రాజమహేంద్రవరం / కాకినాడ / అమలాపురం , నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఉన్నత అధికారుల ఆదేశాలు మేరకు గృహ విద్యుత్ వినియోగదారులకు మరియు వ్యవసాయ వినియోగదారులకు ఎట్టి పరిస్థితులలో విద్యుత్ అంతరాయములు ఏర్పడకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతోందని పర్యవేక్షక ఇంజనీర్ ఆపరేషన్ సర్కిల్: ఏ.పి.ఈ.పి.డి.సి.ఎల్
రాజమహేంద్రవరం టి.వి.ఎస్.ఎన్. మూర్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు.
ఇందులో భాగంగా పరిశ్రమల విద్యుత్ వినియోగంపై పరిమితులు విధించి గృహ వినియోగానికి నిరంతరం మరియు వ్యవసాయానికి తొమ్మిది గంటలు నిరంతరాయముగా 3-ఫేజ్ సప్లై సరఫరా చేయడం కొరకు, ఈ క్రింది విధముగా 05.09.2023 00:00 hrs నుండి 15.09.2023 24:00 hrs వరకు పరిశ్రమల విద్యుత్ సరఫరాను, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వారి ఆదేశాల మేరకు లోడు నియంత్రిచడం జరుగుతున్నట్లు తెలియ చేశారు. ప్రస్తుతం వినియోగదారులందరికి ఎటువంటి విద్యుత్ కోతలు లేవని పేర్కొన్నారు.
పరిశ్రమలు:
కంటిన్యూస్ ప్రాసెస్ పరిశ్రమలు వాటి కాంట్రాక్టడ్ మాక్సిమం డిమాండ్ (సీఎండీ) లో 70% మాత్రమే వాడవలెను ( 24x 7)
నాన్ కంటిన్యూస్ ప్రాసెస్ పరిశ్రమలు పగలు 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల లోపు కేవలం ఒక షిఫ్టును మాత్రమే కొనసాగించవలసి ఉంటుంది. పవర్ హాలిడే వారములో ఒక రోజు ఈ క్రింది విధముగా డివిజన్ వారీగా అమలు పరచడం జరుగుతుంది.
సోమవారం – జగ్గంపేట డివిజన్
మంగళవారం – కాకినాడ డివిజన్
బుధవారం – పెద్దాపురం డివిజన్
గురువారం – రాజమహేంద్రవరం రూరల్ డివిజన్
శుక్రవారం – అమలాపురం డివిజన్ మరియు రంపచోడవరం డివిజన్
శనివారం – రాజమహేంద్రవరం అర్బన్ డివిజన్ మరియు రామచంద్రపురం డివిజన్
ప్రతీ 220/132కె వి సబ్ స్టేషన్ లలో విద్యుత్ సరఫరా పర్యవేక్షించుటకు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి నిరంతర విద్యుత్ సరఫరా పర్యవేక్షణ చేయుచున్నాము. విద్యుత్ సరఫరా యొక్క సమాచారం కొరకు 1912, సంబంధిత అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మరియు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ / ఆపరేషన్ వారిని సంప్రదించవలెనని తెలిపారు.
డివిజన్ స్థాయి అధికారులు ఫోన్ నంబర్స్.
రాజమహేంద్రవరం సర్కిల్ ఆఫీస్ – 7382299960
రాజమహేంద్రవరం టౌన్ డివిజన్ – 9440812585
రాజమహేంద్రవరం రూరల్ డివిజన్ – 7382585487
కాకినాడ డివిజన్ – 9440812586
పెద్దాపురం డివిజన్ – 8333818099
జగ్గంపేట డివిజన్ – 9440812589
అమలాపురం డివిజన్ – 9440812588
రామచంద్రపురం డివిజన్ – 9440812587
రంపచోడవరం డివిజన్ – 7382585554
అత్యవసర మెయింటెనెన్స్ చేయడానికి, బ్రేక్ డౌన్స్, ఫుజ్ ఆఫ్ కాల్స్ చేయడానికి సిబ్బందిని 24x 7 గంటలు ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా మానిటర్ చేయడం జరుగుచున్నది. కావున విద్యుత్ వినియోగదారులందరూ సహకరించవలసినదిగా పర్యవేక్షక ఇంజనీర్, ఆపరేషన్ సర్కిల్,ఏ.పి.ఈ.పి.డి.సి.ఎల్ రాజమహేంద్రవరం కొరియున్నారు.
Prajavartha Online Telugu News