Breaking News

రాజమహేంద్రవరం లో సెప్టెంబర్ 8, 9, 10 తేదీల్లో సీ ఫుడ్ ఫెస్టివల్  

-మంగళవారం ఆర్ట్స్ కళాశాల నుంచి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం వరకు 2 కే రన్
-కలెక్టర్ కె. మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
“సీ ఫెస్టివల్” వేడుకలు రాష్ట్రంలో విజయవాడ, కర్నూల్, విశాఖపట్నం, రాజమహేంద్రవరం లో నిర్వహించకోవడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ లో సీ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యాన్ని కలెక్టర్ వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, సీ ఫుడ్ యొక్క వినియోగాన్ని పెంచడం లో భాగంగా మత్స్య సంపద వలన కలిగే ప్రయోజనాన్ని, వాటి ద్వారా లభించే పోషక విలువలు పై ప్రజల్లో గణనీయమైన అవగాహన కల్పించడం ఈ సీ ఫుడ్ ఫెస్టివల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. మనం నిత్యం తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు తో కూడిన ఆహారం తీసుకోవడం తప్పని సరి అన్నారు. ఇతర నాన్ వెజిటేరియన్ ఆహార పదార్థాల కంటే సీ ఫుడ్ ఆరోగ్య కరమైన కొవ్వుతో నిండిన ఆహారం తీసుకోవడం సాధ్యం అవుతుందన్నారు. ఈ ప్రాంతంలో మంచి ఆక్వా కల్చర్ తో కూడిన ఉత్పత్తులు లభ్యం అవుతాయని మాధవీలత పేర్కొన్నారు. వీటితో ఎన్ని రకాలు అయినా వంటలు వండవచ్చు అనే విషయం సీ ఫుడ్ ఫెస్టివల్ సందర్భంగా మూడు రోజులు పాటు నిర్వహించే వేడుకల్లో సమగ్రంగా వివరించడం, వాటిని ప్రజలకి సరసమైన ధరలకు అందుబాటులో ఉంచడం జరుగుతున్నట్లు పేర్కొన్నారు.

మంగళవారం ఉదయం ఆర్ట్స్ కళాశాల నుంచి మునిసిపల్ కార్యాలయం గోకవరం బస్టాండ్ వరకు 2 కె రన్ కార్యక్రమాన్ని స్థానిక శాసన సభ్యులు జక్కంపూడి రాజా, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, భూమి ఆర్గానిక్ సంస్థ అధినేత రఘురామ్, ఇతర జిల్లా అధికారులతో కలిసి ఉదయం 7 30 కి ప్రారంభించనున్నట్లు తెలిపారు.

సెప్టెంబర్ 8 శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం ఫిష్ ఆంధ్రా డొమెస్టిక్ మార్కెటింగ్ లబ్దిదారులతో, సరఫరా దారులతో సమావేశం. రెండవ రోజు సెప్టెంబర్ 9 రెండవ శనివారం ఆక్వా రైతులు, ప్రోససర్లు, ఎగుమతి దార్లతో ఉదయం సదస్సు, మధ్యాహ్నం విద్యార్థులకు వివిధ ఉపాధి అవకాశాలు పై సదస్సు , ఆక్వా ఉత్పత్తులలో గల పోషక విలువలు అవగాహన సదస్సు నిర్వహించానున్నారు . మూడోవ రోజు సెప్టెంబర్ 10 ఆదివారం గవర్నమెంట్ కాలేజీ విద్యార్థిని విద్యార్థులకు వకృత్వ , వ్యాస రచన, డీబెట్ లలో పోటీలని నిర్వహించి , అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానోత్సవం, తదుపరి ముగింపు వేడుకలు నిర్వహిస్తామన్నారు. మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమంలో మంత్రులు, ఉన్నతాధికారులు, ఆక్వా రైతులు, విద్యార్థిని విద్యార్థులు, పారిశ్రామిక వేత్తలు, తదితరులు పాల్గొననున్నారు. కావున జిల్లా అధికారులు, వారి కుటుంబ సభ్యులు, నగర ప్రజలు, పెద్ద ఎత్తున పాల్గొని ఈ వేడుకలను విజయవంతం చేయాలని కలెక్టర్ మాధవీలత కోరారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, డి ఆర్వో జీ. నరసింహులు, మత్స్య శాఖ సహాయ సంచాలకులు ఎస్కే దిల్షక్,  స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ టూరిజం ఈ డి వి. వెంకటచలం, భూమి ఆర్గానిక్ సంస్థ అధినేత రఘురామ్, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *