-జిల్లా వ్యాప్తంగా ఉన్న 19 మండలాల్లో చేపట్టనున్న మౌలిక సదుపాయాలు
-ఆయా నియోజక వర్గాల ప్రజల డిమాండ్, జేకేసి అర్జీలకు ప్రాధాన్యత
-కె. మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాకు చెందిన ప్రతి మండలంలో ఉన్న గ్రామాల పరిధిలో అంతర్గత రహదారులు, అనుసంధాన రహదారుల నిర్మాణం, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రూ.11.40 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఈ మొత్తం నిధులను ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు ప్రాధాన్యత క్రమంలో పరిగణన లోకి తీసుకుని ఆయా స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రతిపాదించిన మేరకు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే స్థానిక శాసన సభ్యులు ఆమేరకు ఆయా మండలాల్లోని గ్రామ పంచాయతీ ల వారీగా రూ.60 లక్షలతో పలు పనులను ఉపాధిహామీ పథకం కింద చేపట్టనున్నట్లు తెలిపారు. ఆ క్రమంలో శానిటేషన్, డ్రైనేజ్ వ్యవస్థ, సిసి రోడ్ల నిర్మాణం, జగనన్న లే అవుట్ లలో అభివృద్ధి పనులు, జగనన్న కు చెబుదాం కింద ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఆయా పనులు పూర్తి చెయ్యనున్నట్లు కలెక్టర్ మాధవీలత పేర్కొన్నారు.. ఇప్పటికే సంబంధిత శాఖల ఇంజనీరింగ్ విభాగాలకు చెందిన అధికారులు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక మేరకు పనులకు చెందిన ప్రతిపాదన చేసినట్లు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం ఈ నిధులను ఖర్చు చెయ్యడం జరుగుతుందని మాధవీలత తెలియ చేశారు. ఆమేరకు గ్రామ సభలను నిర్వహించి అత్యంత ప్రాధాన్యత కలిగిన పనులకు ఆమోదం పొందడం జరుగుతున్నట్లు పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News