Breaking News

మాజీ సైనికుల, వారి కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తాం

-ప్రత్యేక జాబ్ మేళా ఏర్పాటు చెయ్యడం జరుగుతుంది
-మాజీ సైనిక కుటుంబాలకు ప్రభుత్వ రేటు కు 175 గజాలు ఇంటి స్థలం సమావేశంలో నిర్ణయం
-కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని సైనికుల, వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం ప్రతిపాదించిన అంశాలపై సానుకూలంగా స్పందించే విధానంలో ఆయా శాఖలకు మార్గదర్శకాలు జారీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు.

సోమవారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా సైనిక సంక్షేమ బోర్డు సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, దేశ రక్షణలో సైనికుల సేవలు సదా స్మరణ ఇస్తూ, స్ఫూర్తిని కలిగిస్తుందని పేర్కొన్నారు. సైనిక సంక్షేమ శాఖ ప్రతిపాదించిన అంశాలపై సానుకూల నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హామీ ఇచ్చారు. సమావేశంలో భాగంగా ఇంటి పన్ను మినహాయింపు, వివిధ ప్రభుత్వ శాఖల నుంచి సాధికారికత సాధించే దిశగా అమలు చేస్తున్న పథకాలలో మాజీ సైనికులకు, వారి కుటుంబ సభ్యులకు ప్రాధాన్యత ఇవ్వడం పై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ దుకాణాలు, మునిసిపల్ దుకాణాల్లో షాపులను మాజీ సైనికులకు ప్రాతిపదికన కేటాయింపులు జరపాలని కోరడం జరిగింది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పనలో మాజీ సైనిక కుటుంబ సభ్యులకు కొంత ప్రాధాన్యత ఇవ్వడం తో వృత్తి విద్యా కోర్సుల్లో అవకాశాల కల్పన కు ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని పేర్కొన్నారు. పారిశ్రామిక రంగం లో తగిన గుర్తింపు ఇవ్వడం తోపాటు బ్యాంకు రుణాలను మంజూరు చేయాలని కోరారు. రాజమహేంద్రవరం లో సైనిక సంక్షేమ భవనం నిర్మాణం కోసం ఆరు సెంట్ల స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో సైనిక సంక్షేమ బోర్డ్ ప్రతిపాదించిన అంశాలను పరిగణనలోకి ప్రాధాన్యత క్రమంలో చర్యలు తీసుకుంటామని కలెక్టర్ మాధవీలత స్పష్టం చేశారు. సమావేశంలో పేర్కొన్న అజెండా అంశాలలో హౌస్ టాక్స్ ఎక్సెంప్షన్ మేళా పెట్టడానికి, మాజీ సైనికులకు ప్రత్యేకం గా జాబ్ మేళా పెట్టడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. 175 గజాల గవర్నమెంట్ రేటుకు తీసుకోవడానికి ఆమోదం అయితే వారు తగిన చర్య తీసుకోవడానికి సిద్దము గా ఉన్నట్టు కలెక్టర్ తెలిపారు .

ఈ సమావేశంలో జిల్లా సైనిక సంక్షేమ అధికారి సార్జెండ్ పి. సత్య ప్రసాద్, జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు, గన్నర్ గంటా చంద్ర శేఖర్, సార్జంట్ లు గంధం ప్రసాద్ , జే డబ్ల్యు మూర్తి , జిల్లా పరిశ్రమల శాఖ అధికారి బి. వేంకటేశ్వర రావు, హవల్ దార్ బాలాజీ, హవల్దర్ వివేక్ , మాజీ సైనిక వితంతువు శ్రీమతి సుబ్బా లక్ష్మి వికాస మేనేజర్ సత్యనారాయణ, జిల్లా సైనిక బోర్డ్ వైస్ చైర్మన్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *