-56వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాలను పురాష్కరించుకొని..
– నవంబర్ 14 వ తేది నుండి 20 వ తేది వరకు వరకు..
-రాజమహేంద్రవరం శ్రీ గౌతమీ ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయము నందు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తాం..
-గ్రంధాలయ అధికారి జి. శ్రీదేవి
-జిల్లా వ్యాప్తంగా నవంబర్ 14 వ తేది నుండి 20 వ తేది వరకు గ్రంధాలయ వారోత్సవాలు
-కలెక్టర్ మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమహేంద్రవరం శ్రీ గౌతమీ ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయము నందు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. స్థానిక కలెక్టర్ ఛాంబర్ లో శుక్రవారం రాత్రి గ్రంధాలయ వారోత్సవ సందర్భంగా గోడ ప్రతిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, గ్రంధాలయ వారోత్సవాలు పై ప్రజల్లో, విద్యార్థుల్లో విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. వారోత్సవాలు సందర్భంగా నిర్వహించే పోటీల్లో పాల్గొని విజేతులైన విద్యార్థినీ, విద్యార్థులకు బహుమతి ప్రధానం చెయ్యడం జరుగుతుందని అన్నారు. ఇందులో భాగంగా నవంబర్ 14 వ తేది మంగళవారం ఉదయం 10:30 గంటలకు “బాలల దినోత్సవం ప్రారంభోత్సవ సభ, అనంతరం జాతీయ పక్షి అంశంపై 1వ తరగతి నుండి 5 వ తరగతి విద్యార్థినీ విద్యార్థులకు “చిత్ర లేఖన పోటీలు” నిర్వహిస్తా మన్నారు.
నవంబర్ 15 వ తేది బుధవారం ఉదయం 10.30 గంటలకు “పుస్తక ప్రదర్శన” ఆనంతరం 5వ తరగతి నుండి 10 వ తరగతి విద్యార్థినీ విద్యార్థులకు మీకు నచ్చిన చిత్రాలపై “చిత్ర లేఖన పోటీలు”,
నవంబర్ 16 వ తేది గురువారం ఉదయం 10.30 గంటలకు “గ్రంధాలయోధ్యమకారుల సంస్మరణ సభ అనంతరం భారత్ వికాస్ పరిషత్ వారి అధ్వర్యం లో భారత్ – కొ -జానో – రాజమహేంద్రజవరం బ్రాంచెస్ వారికి క్విజ్ ప్రోగ్రాం.
నవంబర్ 17 వ తేది శుక్రవారం ఉదయం 10.30లకు గ్రంధాలయాలు – ఉపయోగాలు పై 1వ తరగతి నుండి 5 వ తరగతి విద్యార్ధినీ విద్యార్ధులకు”వ్యాస రచన పోటీలు” నిర్వహణ,
నవంబర్ 18 వ తేది శనివారం ఉదయం 10:30 గంటలకు 5వ తరగతి నుండి 10 వ తరగతి, విద్యార్ధినీ విద్యార్థులకు, ప్లాస్టిక్ వలన పర్యావరణానికి కలిగే అనార్ధాలు – ప్లాస్టిక్ ను రిప్రొడక్ట్ చేసే విధానం పై “వ్యాస రచన పోటీలు” నిర్వహణ,.
నవంబర్ 19 వ తేది ఆదివారం ఉదయం 10:30 గంటలకు ‘మహిళా దినోత్సవం” దేశ చట్టము మరియు మహిళా సాధికారితపై చర్చ” అనంతరం భారత్ వికాస్ పరిషత్ వారి ఆధ్వర్యం లో భారత్ – కో –జానో స్టేట్ లెవెల్ క్విజ్ ప్రోగ్రాం మరియు శ్రీ అల్లు రామకృష్ణ వారిచే పురాతన నాణెములు, నోట్లు, పోస్టల్ స్టాంప్ లు, ప్రదర్శన అంశం.
నవంబర్ 20 వ తేది సోమవారం ఉదయం 10.30 గంటలకు డిజిటల్ గ్రంథాలయాలపై విద్యార్ధినీ విద్యార్ధులకు అవగాహన, సామూహిక స్వీయ పఠనము. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సభ నిర్వహించడం జరుగుతుందన్నారు. కావున పై అన్ని కార్యక్రమాలలో పాఠకులు, పురజనులు, విద్యార్థినీ, విద్యార్థులు అందరూ పాల్గొని జయప్రదం చేయవలసినదిగా ఆ ప్రకటనలో కోరారు.ఈ కార్యక్రమం లో లైబ్రేరియన్ పి. శ్రీదేవి, రాజు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News