రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమండ్రి రోడ్ కం రైల్ వంతెన రహదారి మార్గంలో నిర్దేశించిన విధంగా వాహనాలను మాత్రమే అనుమతించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం గోదావరీ వంతెన పై చేపట్టిన పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్ అండ్ బి అధికారులు ఉదయం 9 గంటల నుంచి గోదావరీ వంతెన నుంచి వాహనాలను అనుమతించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె . మాధవీలత జరిగిన మరమ్మత్తు పనుల వివరాలుపై సమాచారం తెలుసుకున్నారు. తదుపరి వంతెన రహదారి నిర్వహణ తదితర అంశాలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జాయింట్లు వద్ద అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. లైట్ వెయిట్ వాహనాలు, మోటార్ సైకిళ్ళు, కార్లు తో పాటు లగేజీ గ్యారేజ్ లేని ఎపీఎస్ ఆర్టీసి, టి ఎస్ ఆర్టీసి పల్లె వెలుగు బస్సులను అనుమతించడం జరుగుతుందని కలెక్టర్ మాధవీలత పేర్కొన్నారు. ఆమేరకు ఆయా సంస్థలకు, డిపో మేనేజర్ లకు ముందస్తు సమాచారం అందచేయాలని మాధవీలత పేర్కొన్నారు. రహదారి మరమ్మతుల నేపధ్యంలో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అధికారులు తెలిపారు.
చాగల్లు కి చెందిన చిరుద్యోగి సిహెచ్.. జానీ మాట్లాడుతూ, నెల పదిహేను రోజులు పాటు మరమ్మత్తుల కోసం వాహనాలు ట్రాఫిక్ నియంత్రణ పాటించి, నేడు వాహనాల ట్రాఫిక్ అనుమతించడం పట్ల ఎంతో ఆనందం గా ఉందన్నారు. మరమ్మత్తు అనంతరం ప్రయాణం చాలా బాగుందని మెచ్చుకున్నారు. గతంలో గోతుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నా మని, కానీ ఈరోజు వంతెన పై ప్రయాణం చాలా బాగుందని తెలియ చేశారు ఈ సందర్శన లో కలెక్టర్ వెంట ఆర్ అండ్ బి – డిఈ బివివి మధు సుధన్, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News