Breaking News

కులగణన పై ఉభయ గోదావరి జిల్లాల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం

-నవంబర్ 17 శుక్రవారం మ.3 గంటలకు రాజమహేంద్రవరం హోటల్ మంజీరా లో
-సమావేశ వేదికపై విలువైన సూచనలు అందచేసే వారు ముందస్తు అనుమతి పొందాలి
-మీమీ జిల్లాల్లో ఆర్డీవో లకు ముందస్తుగా దరఖాస్తులు అందచెయ్యల్సి ఉంటుంది
-హాజరుకానున్న ఉభయ గోదావరి జిల్లాల మంత్రులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, మేధావులు
-తూ.గో. జిల్లా కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం / ఉభయ గోదావరి జిల్లాలు, నేటి పత్రిక ప్రజావార్త :
నవంబర్ 17 వ తేదీ శుక్రవారం రాజమహేంద్రవరం లో నిర్వహిస్తున్న కుల గణన కు సంబందించిన ఉభయ గోదావరి జిల్లాల ప్రాంతీయ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత శనివారం  ఒక ప్రకటనలో వెల్లడిచేశారు.

ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని 5 జిల్లాలకు చెందిన మంత్రులు , ఎంపి. లు , ఎమ్మెల్సీ లు, ఎమ్మెల్యే లు, జెడ్పీ చైర్మన్ లు, స్థానిక సంస్థల ప్రతినిధులు, కుల సంఘాల నాయకులు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు , సభ్యులు, ప్రజా ప్రతినిధులు, మేధావి వర్గం, తదితరులతో సమావేశం ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతోందని పేర్కొన్నారు.

రాజమహేంద్రవరం లోని హోటల్ మంజీరా నందు నవంబర్ 17 వ తేదీ శుక్రవారం సా 3.00 గంటల నుంచి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్న దృష్ట్యా తప్పక హాజరై తమ విలువైన సూచనలు, సలహాలు ఇవ్వడం కోసం రాష్ట్రప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రాంతీయ స్థాయిలో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

కులగణన పై సూచనలు సలహాలు ఇచ్చే వ్యక్తులు, ప్రతినిధులు ముందస్తుగా ఆయా రెవెన్యూ డివిజన్ అధికారులకు సమావేశంలో ప్రసంగించడానికి దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. కుల గణన ప్రక్రియ ఫలవంతం అయ్యే విధంగా తమ విలువైన సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఉభయ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలోని పశ్చిమ గోదావరి, ఏలూరు, కాకినాడ, డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి జిల్లా లకు చెందిన మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రతినిధులు, వివిధ కులాలకు, తెగలకు చెందిన సంఘ నాయకులు, ప్రతినిధులు, వివిధ కులాల కార్పొరేషన్ లకు (56) చెందిన చైర్మన్లు, సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు , సామాజిక వర్గాల మేధావీ వర్గం కు చెందిన వ్యక్తులు ఈ రౌండ్ టేబుల్ సమావేశం లో పాల్గొని వారి విలువైన సూచనలు ఇవ్వడం కోసం సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *