-జెడ్పీ సీఈఓ ఆర్. వెంకట రామన్
శ్రీకాకుళం, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి ప్రజల్లో విస్తృతస్దాయిలో అవగాహన కల్పించే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ప్రతిష్ఠా్మకంగా నిర్వహిస్తున్నకార్యక్రమమే వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర అని శ్రీకాకుళం జిల్లా జెడ్పీ సీఈఓ ఆర్. వెంకట రామన్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కోట పాలెం గ్రామం లో శనివారం వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర అంగరగవైభవంగా ప్రారంభం అయింది.ఈ సందర్భంగా ఆయన దూరదర్శన్ తో మాట్లాడుతూ, జిల్లాలోని 912 గ్రామ పంచాయతీల పరధిలో ఈ యాత్ర నిర్వహించడం జరుగుతుందన్నారు. దీనికి సంబంధించి జిల్లాకు యెనిమిది ప్రచార వాహనాలు వస్తున్నాయని ఇంతవరకు ఒక్కటే వచ్చిందని చెప్పారు. ప్రతి రోజూ రెండు గ్రామాల చొప్పున వచ్చే ఏడాది జనవరి 26వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. యాత్రలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 17 పథకాల గురించి ప్రజలకు తెలియజేయడంతో పాటు ఇంకా లబ్దిపొందని వారికి వెంటనే లబ్ది కల్పించే విధంగా చర్యలు తీసుకుంటారని తెలిపారు. అలాగే, మెడికల్ క్యాంపులు నిర్వహిస్తారన్నారు. రైతులకు డ్రోన్ల ద్వారా పురుగుమందులు, ఎరువులు పిచికారి చేసుకునే విధానాన్ని చూపిస్తారని తెలిపారు. జిల్లాలో ఈ వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రను విజయవంతం చేయాలని ఆయన జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివిధ అభివద్ధి సంక్షేమ పథకాలు అమలు చేషే అధికారులు వారి వారి శాఖల ద్వారా జరుగుతున్న కార్యక్రమాలు వివరించారు.. ఆయశ్మాన్ భారత్ పథకం పేద కుటుంబాలకు ఒక వరం వంటిదని కొనియాడారు.. ఈ ప్రారంభ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా అధికారులు కోట పాలెం గ్రామం ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు..