రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
నరేంద్రపురం రైతు భరోసా కేంద్రము నందు శనివారం ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం, ఏరువాక కేంద్రం, రాజమహేంద్రవరం వారు అంతర్జాతీయ చిరు ధాన్యాల సంవత్సరం, 2023 ను పురస్కరించుకుని “చిరు ధాన్యాలు యాజామాన్యం మరియు విలువ జోడింపు” అనే అంశం గురించి రైతు శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగినది. ఈ శిక్షణా కార్యక్రమానికి డా. ఎమ్. భారత లక్ష్మి, అసోషియేట డైరెక్టర్ ఆఫ్ రిసెర్చ్, ప్రాంతీయ వ్యవసాయ పరిశోదనా స్థానం, మారుటేరు వారు అధ్యక్షత వహించి, రైతులు తమ ఆర్యోగ్యాన్ని పెంపొందించే చిరుధాన్యాలు, రాగులు, కొర్రలు, సజ్జలు మొదలగునవి పండించాలని సూచించారు. తర్వాత ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి గా పాల్గొన్న జిల్లా వ్యవసాయ అధికారి, డా. ఎస్. మాధవరారావు గారు చిరుధాన్యాలు వైపు రైతులు మొట్టు చూపాలని, వాటిని పండించాలిని అందుకు వ్యవసాయ శాఖ పూర్తి సహకారాన్ని అందిస్తుందని తెలిపారు. ఆత్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ జ్యోతిర్మయి గారు మాట్లాడుతూ చిరుధాన్యాలు పండించే రైతులకు ప్రోత్సాహం కింద ఉచితంగా చిరుధాన్యాల విత్తనాలను, ఇతర ఇన్ పుట లను ఇవ్వగలమని తెలిపారు. తర్వాత వ్యవసాయ పరిశోధనా స్థానం, పెద్దాపురం శాస్త్ర వేత్త డా. సుధీర్ కుమార్ రైతులకు వివధ చిరు ధాన్యాల సాగు పద్దతులలో మెళకువలు, మంచి ధిగు బడి నిచ్చే రకాలను గురించి, చీదపీడలను గురించి, పవర్ పాయింట్ ప్రదర్శన ద్వారా రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఎ. డి. ఎ., రాజమహేంద్రవరం శ్రీనివాసుల రెడ్డి గారు సజ్జ సాగును మూడవ పంటగా సాగు చేయ వచ్చని రైతులకు తెలిపారు. ఈ కార్యక్రమం లో ఏరువాక కేంద్రం కొఆర్డినేటర్ డా. ఎమ్. నంద కిషోర్ రైతులకు పలుసూచనాలు చేసిన పెద్దలకు, అధికారులకు ధన్యవాదములు తెలిపారు. ఈ కార్య క్రమంలో డా. కె. అచ్చ్యు రాజు, శాస్త్ర వేత్త (విస్తరణ), మండల వ్యవ సాయ అధికారి , కాశీం, వి. ఎ. ఎ. ధర్మరాజు, గ్రామ సర్పంచ్, ముసలయ్య గారు, గ్రామ వ్యవసాయ మండలి సలహాదారు రాంబాబు గారు, సొసైటీ అధ్యక్షులు శ్రీనివాస్ గారు, నరేంద్రపురం, నందరాడ, వెలుగు బండ, కలవచర్ల రైతులు పాల్గొన్నారు. అల్లాగే ఈ కార్యక్రమానికి రావే విద్యార్ధిని లు సహకారం అందించారు. అల్లాగే ఈ కార్య క్రమంలో సేంద్రీయ సాగు ప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు.
సభ అనంతరం, గ్రామంలో చిరు ధాన్యాల సాగు, విలువ జోడింపు గురించి నినాదాలు చేస్తూ అధికారులు, శాస్త్రవేత్తలు, రైతులు, విద్యార్ధిని లు సేంద్రీయ సాగు ప్రతినిధులు, మహిళలు ర్యాలీ నిర్వహించారు.
Prajavartha Online Telugu News