రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ నాడు నేడు ద్వారా పాఠశాలలు ఆధునీకరణ, మౌలిక సదుపాయాలను కల్పిస్తుందని విద్యార్థులు సద్వినియోగం జిల్లా ఇంఛార్జి మంత్రి, రాష్ట్ర బిసి సంక్షేమ, సమాచార పౌర సంబంధాల, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి చెల్లు బోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ అన్నారు.
శుక్రవారం గణేష్ చౌక్ వద్ద ఉన్న బిసి సంక్షేమ వసతి గృహాన్ని జిల్లా ఇంఛార్జి మంత్రి, రాష్ట్ర బిసి సంక్షేమ, సమాచార పౌర సంబంధాల, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి చెల్లు బోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ మంత్రి వేణు గోపాల్ విద్యార్థులతో ముచ్చటించారు. రాష్ట్రంలో జగనన్న ముఖ్యమంత్రి గా విద్యార్థులకి ఉన్నత చదువులు తో పాటు , మంచి పోషక విలువలుతో కూడిన ఆహారం , జగనన్న విద్యా కానుక , అమ్మఒడి , వసతి దీవెన , విద్యా దీవెన , విదేశీ విద్యా వంటి పథకాలు అమలు చేస్తూ భరోసా గా నిలిచారని అన్నారు. నాడు నేడు కార్యక్రమము ద్వారా ప్రభుత్వ స్కూల్స్ లో అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో తీసుకుని రావడం జరిగిందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ స్కూల్స్ అభివృద్ధి చేయడం తో పాటు నాణ్యమైన విద్యను అందించడం జరుగుతోందని అన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా పిల్లలకు అందించే మెనూ పరిశీలించి సూచనలు చెయ్యడమే కాకుండా, పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. పేద కుటుంబాలకు చెందిన పిల్లలు సంక్షేమ వసతి గృహాల్లో ఉండి చదువు కుంటారని ఇంటిని మరిపించేలా నేడు ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల నిర్వహణా ఉంటోందని అన్నారు.
Prajavartha Online Telugu News