-మొదటి ఏడాది మెడికో లతో భారీ ర్యాలీ
-ప్లాస్టిక్ వాడకం – క్యాన్సర్ కు కారకం
-క్యాన్సర్ పై కలిసి పోరాడుదాం .. కలిసి గెలుస్తాం
-ప్రిన్సిపల్ డా బి. సౌభగ్య లక్ష్మి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
క్యాన్సర్ నివారణ కోసం సంరక్షణ అంతరాన్ని అధిగమిద్దాం నినాదంతో 2024 లో క్యాన్సర్ పై ప్రజల్లో అవగాహన కల్పించడం జరుగుతుందనీ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డా బి. సౌభాగ్య లక్ష్మి పేర్కొన్నారు. శనివారం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో క్యాన్సర్ అవగాహన ర్యాలీలో మెడికో లు, వైద్యులు, ఇతర వైద్యnఆరోగ్య శాఖ అధికారులతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డా బి. సౌభాగ్య లక్ష్మి మాట్లడుతూ, దేశ వ్యాప్తంగా 2022 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 14 లక్షలకు పైగా కొత్త కేసులు వెలుగు చూసి నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్్వ) గణాంకాలు వెల్లడించాయి. ఆ కారణంగా 9 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారన్నారు. క్యాన్సర్ పై అవగాహన కల్పించడం ద్వారా మరణాల రేటును గణనీయంగా తగ్గించడం సాధ్యం అన్నారు. పురుషుల్లో పెదవి- నోరు, ఊపిరితిత్తులు, అన్నవాహిక క్యాన్సర్లు , మహిళల్లో రొమ్ము, గర్భాశయ ముఖద్వార (సర్వై కల్), అండాశయానికి సంబంధించిన క్యాన్సర్లు ఎక్కువగా నమోదవ్వడం చేశామన్నారు. అత్యధిక మరణా లకూ ఈ రకాలే కారణమైనట్లు డబ్ల్యూహెచ్వో గుర్తించడం జరిగిందన్నారు. ఆరోగ్య కరమైన ఆహారపు అలవాట్లు, జీవన విధానం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా క్యాన్సర్ రాకుండా కాపాడుతుందన్నారు.
కమ్యూనిటీ మెడిసీన్ ప్రథాన అధికారి డా వివి దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ, క్యాన్సర్ మహమ్మారి పట్ల అవగాహన కలిగి ఉండడం తో పాటు, పొగాకు, మత్తు పదార్థాలను దూరంగా ఉండాలన్నారు. ప్లాస్టిక్ వంటి పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.
ఈ ర్యాలీలో వైద్య కళాశాల ప్రొఫెసర్లు , లెక్చరర్స్ , వైద్యాధికారులు డా కేవి ఫణి మాధవీ , డా వి. సూర్యా రావు , డా ఆర్. సురేంద్ర బాబు, డా కే. దీప్తి , డా జి. స్రవంతి , శ్రీనివాస మూర్తి , శివ ప్రసన్న , పేరయ్య శాస్త్రి , ఆర్ .. శ్రీనివాస్ , మొదటి ఏడాది మెడికో లు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News