Breaking News

జనవరి 24 న జాతీయ బాలల దినోత్సవం

రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త :
పిల్లల్లో ఆరోగ్యం, ఆరోగ్య కరమైన ఆహారపు అలవాట్లు పై అవగాహన కల్పించడం చాలా అవసరం అని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. శనివారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్ లో జనవరి 24 న జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా నిర్వహించిన వ్యాసరచన , వక్తృత్వ, చిత్ర లేఖనం పోటీల విజేతలు కలెక్టర్ ధ్రువపత్రాలు అందచేశారు.
విజేతల వివరాలు జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వారితో సేవ్ గర్ల్ చైల్డ్ నినాదంతో విద్యార్థులకు వక్తత్వ, వ్యాసరచన,చిత్రలేఖన పోటీలు నిర్వహించి , విజేతలకు మొదటి బహుమతి రూ.5000 , రెండో బహుమతి రూ.3000, మూడో బహుమతి రూ.2000 తోపాటు ప్రశంసా పత్రం, మెమొంటోను అందజేయడం జరిగింది.
వ్యాసరచన పోటీలో ప్రధమ, ద్వితీయ ,తృతీయ బహుమతులు వరుసగా ఎస్ అనూష ,పదవ తరగతి, బిఆర్ అంబేద్కర్ గురుకులం గోపాలపురం.
రెండవ బహుమతి పి అమృత, పదవ తరగతి , ఎల్ఎంసి హైస్కూలు రాజమహేంద్రవరం వారికి తృతీయ బహుమతి జీవి కావ్య శ్రీ తొమ్మిదో తరగతి ఎస్కేవిటి ఇంగ్లీష్ మీడియం గర్ల్స్ హై స్కూల్ రాజమహేంద్రవరం. అదేవిధంగా వ్యక్తిత్వ పోటీలో ప్రధమ ద్వితీయ తృతీయ బహుమతులు వరుసగా డి జయ నాగ దుర్గాదేవి పదో తరగతి ఎల్ఎంసి హైస్కూల్ రాజమహేంద్రవరం .
ఎస్ మహాలక్ష్మి .తొమ్మిదో తరగతి, ఎస్కే వేటి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్  రాజమహేంద్రవరం, పి శ్రీవల్లి, పదవ తరగతి , జడ్పిహెచ్ఎస్ ప్రభాకర్ నగర్, సీతానగరం చిత్రలేఖనంలో వరుసగా ప్రధమ ద్వితీయ తృతీయ బహుమతులు కే ప్రవల్లిక పదవ తరగతి , ఎస్కే వేటి ఇంగ్లీష్ మీడియం గర్ల్స్ హై స్కూల్ , ఆర్ గీత శ్రీ, పదవ తరగతి .బిఆర్ అంబేద్కర్ గురుకులం గోపాలపురం, వి పావని తేజశ్రీ , పదవ తరగతి ఎల్ఎంసి హై స్కూల్ రాజమహేంద్రవరం. ఈ కార్యక్రమంలో జిల్లా లేప్రసి నియంత్రణ అధికారి డా ఎన్. వసుంధర, ఇతర వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *