ఎన్నికల కౌంటింగ్ ప్రశాంనిర్వహణకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు

-తిరుపతి జిల్లా ఎస్పీ హర్ష వర్ధన్ రాజు
-ఎన్నికల ప్రక్రియ కౌంటింగ్ ప్రశాంత నిర్వహణకు సహకరించిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు, అభ్యర్థులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అందరు అధికారులకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సజావుగా ప్రశాంతత వాతావరణంలో జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, అభ్యర్థులకు, రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఎన్నికల విధులలో పాల్గొని సహకరించిన అధికారులకు మీడియా ప్రతినిధులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.

మంగళవారం రాత్రి కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు, ఏడు పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ సజావుగా ప్రశాంత వాతావరణంలో పూర్తి అయిందని ఇందుకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కౌంటింగ్ పూర్తి అయిన తర్వాత ఈసిఐ వెబ్సైట్ నందు ఎన్కోర్ లో డేటా అప్లోడ్ చేయడం జరిగిందని, గొప్ప ఎన్నికల ప్రక్రియ జరిగిందనీ తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి మరో రెండు రోజులు అమలులో ఉంటుందని తెలిపారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవిఎం ల సీలింగ్ చేసి సెంట్రల్ వేర్ హౌసింగ్ నందు భద్ర పరచడం జరుగుతుందని తెలిపారు. ఎలక్షన్ ప్రక్రియలో సుమారు ముప్పై వేలమంది వివిధ స్థాయిలోని రిటర్నింగ్ అధికారులు, బూత్ లెవెల్ స్థాయి నుండి పోలింగ్ ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, సెక్టరాల్ అధికారులు, నోడల్ అధికారులు, తదితర అధికారుల సహకారంతో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఎప్పటికప్పుడు రాజకీయ పార్టీల ప్రతినిధులతో, అభ్యర్థులతో సమావేశం నిర్వహించడం జరిగిందని వారి సహకారం వలన ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ, కౌంటింగ్ జరిగిందనీ తెలిపారు. పోలింగ్ రోజున మరియు మరుసటి రోజున జరిగిన ఘటన నేపథ్యంలో మరింత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయడం జరిగిందని, పక్కా బందోబస్తు ఏర్పాటు చేసిన ఎస్పీ, సీఎపీఫ్ తదితర ఏర్పాటుతో భద్రతా ఏర్పాట్లు చేపట్టి ప్రశాంతంగా కౌంటింగ్ నిర్వహణకు కృషి చేసిన ఎస్పీ హర్ష వర్ధన్ రాజు, వారి పోలీస్ యంత్రాంగానికి ధన్యవాదాలు తెలియ చేశారు. తిరుపతి నియోజక వర్గం తప్పా మిగిలిన అన్ని నియోజక వర్గాలలో పోలింగ్ శాతం పెరిగిందని, అందరూ ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రజలందరికి కలెక్టర్ హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియ చేశారు.

ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికలు, కౌంటింగ్ ప్రశాంతంగా నిర్వహించడంలో తమ విధులు నిర్వర్తించిన పోలీస్ అధికారులకు, సిబ్బందికి, రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థుల సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలిపారు.

Check Also

గుంటూరులో  అక్టోబర్ 13న ఇండియా పోస్ట్ రన్-2024

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ తపాలా వారోత్సవాల సందర్భంగా అక్టోబర్ 13న గుంటూరులో ఇండియా పోస్ట్ రన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *