Breaking News

డాక్టర్‌ తరుణ్‌ కాకానికి ‘బెస్ట్‌ అడ్వెంచర్‌ టూర్‌ ఆపరేటర్‌’ పురస్కారం

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శుక్రవారం జరిగిన ‘ప్రపంచ పర్యాటక దినోత్సవం’ కార్యక్రమంలో ఏపీటీఎఫ్‌-ఏపీ టూరిజం ఫోరమ్‌ మరియు అడ్వెంచర్‌ టూరిజం ప్రెసిడెంట్‌, అమరావతి బోటింగ్‌ క్లబ్‌ సీఈఓ డాక్టర్‌ తరుణ్‌ కాకాని కి 2023-2024 కొరకు వాటర్‌స్పోర్ట్స్‌ కోసం బెస్ట్‌ అడ్వెంచర్‌ టూర్‌ ఆపరేటర్‌ పురస్కారాన్ని అందుకున్నారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌, తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్‌, మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్‌, ఎపిటిడిసి టూరిజం కార్ప్‌ ఛైర్మన్‌ బాలాజీ నూకసాని, పర్యాట శాఖ కార్యదర్శి వినయ్‌చంద్‌ వాడ్రేపు, ఎపిటిడిసి ఎండి అభిషిక్త్‌ కిషోర్‌ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని, సర్టిఫికెట్‌, జ్ఞాపికను తీసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్‌ తరుణ్‌ కాకాని మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ హాజరైన ఈ కార్యక్రమంలో ఈ పురస్కారం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ పురస్కారం కస్టమర్ల ఎంజాయ్‌మెంట్‌ కల్పించడమే కాకుండా భద్రత కల్పించడంలో మరింత బాధ్యత పెరిగిందన్నారు. ‘ప్రపంచ పర్యాటక దినోత్సవం’ రోజున ఈ గుర్తింపు రావడానికి కారణం తమ టీమ్‌ మొత్తం కలిసిచేసిన కృషే కారణమన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *