అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు దసరా సందర్బంగా సెలవుల్ని ప్రకటిస్తూ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే విద్యాసంవత్సరం కొనసాగుతున్న నేపథ్యంలో మధ్యలో దసరా సెలవులకు అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సెలవులు ఖరారు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో విద్యార్ధులకు ఈ ఏడాది దసరా సెలవుల తేదీలను అధికారులు ప్రకటించారు. వీటినే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు దసరా సెలవుల తేదీల్ని ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే నెల 3 నుంచి 14 వరకు పాఠశాలలకు దసరా సందర్భంగా సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వచ్చే నెల 15న తిరిగి స్కూళ్లు ప్రారంభమవుతాయని ఏపీ సర్కార్ ఉత్తర్వుల్లో పేర్కొంది. అంటే ఈసారి మొత్తం 12 రోజుల పాటు విద్యార్ధులకు దసరా సెలవులు లభించనున్నాయి.
Tags amaravathi
Check Also
అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం
-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …
Prajavartha Online Telugu News