Breaking News

గుంటూరులో  అక్టోబర్ 13న ఇండియా పోస్ట్ రన్-2024

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ తపాలా వారోత్సవాల సందర్భంగా అక్టోబర్ 13న గుంటూరులో ఇండియా పోస్ట్ రన్ – 2024 నిర్వ హిస్తున్నట్లు విజయవాడ రీజియన్ పోస్ట్ మాస్టర్ జనరల్ డీఎస్ వీఆర్ మూర్తి తెలియజేశారు. విజయవాడలోని తన కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ. ఫిట్ ఇండియా, ఫిట్ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా ప్రతిఒక్కరిని ఆరోగ్యంపై పునరాలోచింపజేయడమే పోటీల లక్ష్యమని చెప్పారు. 3కె, 5కె, 10కె  విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. 5కె, 10కె పురుష, మహిళా విభాగాల్లో విజేతలకు రూ.2,40,000 నగదు రివార్డులు అందించనున్నట్లు చెప్పారు. గుంటూరు ఆంధ్రా లూథరన్(బీఈడీ) కళాశాల వద్ద 5 అక్టోబర్ 13వ తేదీ 6 ఉదయం గంటలకు పోటీలు ప్రారంభం అవుతాయన్నారు. 10కెలో పాల్గొనదలచిన వారు రూ.500, 5కెకు రూ.400, 3కెకు రూ.300 చెల్లించి అక్టోబర్ ఏడో తేదీలోగా https:///indiapostrunap.iq301.com వెబ్ సైట్ లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. విజేతలకు నగదు బహుమతులను అదే రోజు సాయంత్రం ఆంధ్రా లూథరన్ కళాశాల వద్ద అందిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ జనరల్ కందుల సుధీర్ బాబు, గుంటూరు డివిజన్ సూపరిండెంట్ ఆఫ్ పోస్ట్ మాస్టర్   యు.యలమందయ్య తదితరులు పాల్గొన్నారు.
అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *