సేవా సంస్థల మీద తిరుగుబాటు ను ఖండిస్తున్నాం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణ నది తీరాన పిండ ప్రధానల సమయం లో ఎండ, వానలకు పురోహితులు ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశం తో వెల్లంపల్లి ఫౌండేషన్ ద్వారా శాశ్వత షెడ్ ను ఏర్పాటు చేశామని ఫౌండేషన్ డైరెక్టర్ కొనకళ్ల విద్యాధరరావు తెలిపారు .
అలాంటి ఫౌండేషన్ బోర్డు పైన గుర్తు తెలియని వ్యక్తులు నల్ల రంగు పులమటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు . ఈ పని చేసిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కృష్ణ నది తీరాన పిండ ప్రధానాలు చేసే ఘాట్ లో వెల్లంపల్లి ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన షెడ్ పై ఉన్న నేమ్ బోర్డు పై నల్ల రంగు పూలమటం ను కృష్ణ నదీ పురోహిత సంఘం సభ్యులు ఖండించారు . ఈ సందర్భంగా కృష్ణానది పురోహిత సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ ఒకప్పుడు దుర్గ ఘాట్ పిండ ప్రదానాలు చేసేవాళ్లమని… ఘాట్ లో పిండ ప్రధానాలు చేసే సమయంలో ఎండ వాన లకు తీవ్ర ఇబ్బందులు పడే వాళ్ళమని చెప్పారు. ఆ ఇబ్బందులు అప్పటి శాసన సభ్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ దృష్టి కి తీసుకుని వెళ్ళగా … వెంటనే స్పందించిన ఆయన తమ సమస్యల కు శాశ్వత పరిష్కారం చూపుతూ వెల్లంపల్లి ఫౌండేషన్ ద్వారా శాశ్వత షెడ్ ను ఏర్పాటు చేశారని చెప్పారు . రాజకీయ పార్టీ లతో తమకు ఎటువంటి సంబంధం లేదని… సేవా కార్యక్రమాల పై ఇలాంటి ఘటలకు పాల్పడటం సరైనది కాదని వెల్లడించారు. అనంతరం వెల్లంపల్లి ఫౌండేషన్ డైరెక్టర్ కొనకళ్ల విద్యాధరరావు మాట్లాడుతూ కృష్ణా నది తీరాన పిండ ప్రధానాలు చేసేందుకు గతంలో వెల్లంపల్లి ఫౌండేషన్ ద్వారా కృష్ణ నది తీరాన ఒక షెడ్ ఏర్పాటు చేయటం జరిగిందనీ చెప్పారు . ఇవే కాక ఫౌండేషన్ ద్వారా రాజకీయాలకు, కుల మతాలకు అతీతంగా అనేక సేవా కార్యక్రమాలు చేసినట్లు గుర్తు చేశారు . తల్లిదండ్రులకు కర్మ కాండలు చేసేందుకు దేశ వ్యాప్తం గా హిందువులు కృష్ణ నది తీరానికి చేరుకుంటారనీ అలాంటి ప్రదేశం లో షెడ్ నిర్మాణం చేశామని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసే ఫౌండేషన్ బోర్డు మీద నల్ల రంగు పులమటం ను తీవ్రంగా ఖండిస్తున్నాట్లు పేర్కొన్నారు. ఎవరెన్ని ఆకృత్యాలు చేసిన తాము నిర్వహించే సేవా కార్యక్రమాలు ఆగవనీ స్పష్టం చేశారు .ఇలాంటి విషయాన్ని ప్రజలు కూడా తీవ్రంగా ఖండించాలనీ కోరారు. ఈ పని చేసిన వారిపై పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలనీ డిమాండ్ చేశారు. సేవా సంస్థల మీద తిరుగుబాటు ను ఖండిస్తున్నట్లు స్పష్టం చేశారు. విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేస్తామని చెప్పారు.

Check Also

గుంటూరులో  అక్టోబర్ 13న ఇండియా పోస్ట్ రన్-2024

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ తపాలా వారోత్సవాల సందర్భంగా అక్టోబర్ 13న గుంటూరులో ఇండియా పోస్ట్ రన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *